ETV Bharat / sports

స్టార్ అథ్లెట్​ విషయంలో మోసపోయిన సెహ్వాగ్​.. అది నిజమని నమ్మి!

author img

By

Published : Jul 30, 2022, 7:24 PM IST

Himadas virendra sehwag: టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​.. స్టార్​ అథ్లెట్​ హిమదాస్​ విషయంలో మోసపోయారు! ఏం జరిగిందంటే?

Himadas virendra sehwag
స్టార్ అథ్లెట్​ విషయంలో మోసపోయిన సెహ్వాగ్​

Himadas virendra sehwag: బర్మింగ్‌హమ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్​ గేమ్స్​లో భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌ స్వర్ణం గెలిచిందన్న ఆనందంలో సోషల్​మీడియా వేదికగా చాలా మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడీ వార్త ఫేక్​ అని తేలింది. దీంతో శుభాకాంక్షలు తెలిపిన వారు తమ పోస్టలను డిలీట్​ చేసే పనిలో బిజీ అయ్యారు. వీరిలో టీమ్​ఇండియా డాషింగ్ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​ కూడా ఉన్నాడు. వెంటనే తాను పెట్టిన పోస్ట్​ను డిలీట్​ చేశాడు.

కాగా, 400 మీటర్ల పరుగు పందెంలో హిమదాస్​ గోల్డ్​ మెడల్​ సాధించిందని ఓ వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. నిజానికి నేడు(జులై 30) ఆమె ఈవెంటే లేదు. ఇక ఈ కామన్వెల్త్​ క్రీడల్లో భారత్​ బోణి కొట్టింది. వెయిట్​లిఫ్టింగ్​లో ఏకంగా రెండు పతకాల్ని సాధించింది. 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్‌​ సార్గర్​ రజత పతకం అందుకోగా.. 61కేజీలో విభాగంలో గురురాజ్​ పూజారి కాంస్య పతకం సాధించాడు.

ఇదీ చూడండి: భారత్​ బోణీ.. వెయిట్​ లిఫ్టింగ్​లో రెండు పతకాలు.. గాయంతోనే 248 కేజీలు ఎత్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.