ETV Bharat / sports

హైదరాబాద్​లో విరాట్ కోహ్లీ భారీ కటౌట్​.. స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్​లో..

author img

By

Published : Nov 5, 2022, 10:40 AM IST

టీమ్​ఇండియా పరుగుల రారాజు విరాట్ కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఏకంగా భారీ కటౌట్​లను ఏర్పాటు చేసి సంబరాలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్​మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి దాదాపు మూడేళ్లపాటు ఒక్క సెంచరీ కూడా కొట్టక చాలా మాటలు పడ్డాడు కోహ్లీ. సర్వత్రా విమర్శలు.. ఉచిత సలహాలు.. జట్టుకు భారం అనే మాటలు.. ఇలా మానసికంగా వేదనను అనుభవించాడు. ఇక అతడి పనైపోయిందన్నారు.. ఆటకి పనికిరాడని అన్నారు. రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెటర్ అని తెగ విమర్శలు చేశారు. అన్నీ సైలెంట్​గా ఉండి భరించాడు. తనకంటూ ఓ రోజు వస్తుందని ఎదురుచూశాడు. ఆ రోజు రానే వచ్చింది. మాటలతో చెబితే కిక్ ఏముంటుందని.. బ్యాట్​తో సమాధానం చెప్పి తనపై విమర్శలన్నింటికీ చెక్​ పెట్టాడు. తనను విమర్శించిన వారిచేతే మెచ్చుకునేలా చేసుకున్నాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్​కప్​లోనూ అదరగొడుతున్న విరాట్​ పుట్టినరోజు నేడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. అతడిపై తమ అభిమానాన్ని వినూత్న రూపాల్లో చాటుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా విరాట్​ బర్త్​తే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇక్కడి అభిమానులు తమ అభిమానం దేశానికి తెలిసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్​లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్​లో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. విషయం తెలిసిందే. సాధారణంగా ఇక్కడ తెలుగు స్టార్ హీరోల కటౌట్స్ మాత్రమే పెడుతుంటారు. ఇప్పుడు అదే ప్లేస్​లో కోహ్లీ నిలిచి.. తొలి క్రికెటర్​గా ఈ ఘనత సాధించాడు. ఇది సోషల్ మీడియాలో ఫుల్​ వైరల్​ అవుతోంది. విజయవాడలోనూ 40 అడుగుల కోహ్లీ కటౌట్, ముంబయిలో ఓ భారీ గోడపై కోహ్లీ పెయింట్​ వేసి వీర లెవెల్​లో గీశారు. ప్రస్తుతం ఈ ఫొటోలన్నీ తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Kohli big cut out in hyderabad
హైదరాబాద్​లో విరాట్ కోహ్లీ భారీ కటౌట్​.. స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్​లో..

టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి దాదాపు మూడేళ్లపాటు ఒక్క సెంచరీ కూడా కొట్టక చాలా మాటలు పడ్డాడు కోహ్లీ. సర్వత్రా విమర్శలు.. ఉచిత సలహాలు.. జట్టుకు భారం అనే మాటలు.. ఇలా మానసికంగా వేదనను అనుభవించాడు. ఇక అతడి పనైపోయిందన్నారు.. ఆటకి పనికిరాడని అన్నారు. రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెటర్ అని తెగ విమర్శలు చేశారు. అన్నీ సైలెంట్​గా ఉండి భరించాడు. తనకంటూ ఓ రోజు వస్తుందని ఎదురుచూశాడు. ఆ రోజు రానే వచ్చింది. మాటలతో చెబితే కిక్ ఏముంటుందని.. బ్యాట్​తో సమాధానం చెప్పి తనపై విమర్శలన్నింటికీ చెక్​ పెట్టాడు. తనను విమర్శించిన వారిచేతే మెచ్చుకునేలా చేసుకున్నాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్​కప్​లోనూ అదరగొడుతున్న విరాట్​ పుట్టినరోజు నేడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. అతడిపై తమ అభిమానాన్ని వినూత్న రూపాల్లో చాటుకుంటున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా విరాట్​ బర్త్​తే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇక్కడి అభిమానులు తమ అభిమానం దేశానికి తెలిసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్​లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్​లో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. విషయం తెలిసిందే. సాధారణంగా ఇక్కడ తెలుగు స్టార్ హీరోల కటౌట్స్ మాత్రమే పెడుతుంటారు. ఇప్పుడు అదే ప్లేస్​లో కోహ్లీ నిలిచి.. తొలి క్రికెటర్​గా ఈ ఘనత సాధించాడు. ఇది సోషల్ మీడియాలో ఫుల్​ వైరల్​ అవుతోంది. విజయవాడలోనూ 40 అడుగుల కోహ్లీ కటౌట్, ముంబయిలో ఓ భారీ గోడపై కోహ్లీ పెయింట్​ వేసి వీర లెవెల్​లో గీశారు. ప్రస్తుతం ఈ ఫొటోలన్నీ తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఇదీ చూడండి: T20 worldcup: మళ్లీ అంపైరింగ్‌ పొరపాటు.. ఈసారి ఆ విషయంలో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.