IND VS PAK: టీమ్​ఇండియా ఓటమికి కారణాలు ఇవేనా..!

author img

By

Published : Oct 25, 2021, 7:22 AM IST

Updated : Oct 25, 2021, 9:27 AM IST

T20 world cup 2021

ఐసీసీ టోర్నీలో తొలిసారి పాక్ చేతిలో (T20 world cup 2021) టీమ్​ఇండియా ఓటమి పాలైంది. ఇంతకీ భారత్ ఓడిపోవడానికి (pak vs india match) కారణలేంటి? ఎక్కడ తప్పు జరిగింది?

ఐసీసీ ప్రపంచకప్​ల్లో (T20 world cup 2021) పాకిస్థాన్​పై ఓటమి ఎరుగని టీమ్​ఇండియాకు షాక్ తగిలింది. యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్​లోని తమ తొలి (pak vs india match) మ్యాచ్​లోనే ఓడిపోయింది. ఓ టీ20 మ్యాచ్​లో భారత్​ 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి కాగా.. పొట్టి ఫార్మాట్​లో 10 వికెట్ల తేడాతో నెగ్గడం కూడా పాక్​కు ఇదే తొలిసారి. ఇవన్నీ పక్కన పెడితే అసలు టీమ్​ఇండియా ఓటమి కారణాలేంటి అనేది ఓసారి పరిశీలిద్దాం..!

  1. 2016 నుంచి దుబాయ్​లో అన్ని టీ20ల్లోనూ పాక్ విజయం సాధించింది. ఆ విషయం పాక్​కు కలిసొచ్చిందనే చెప్పాలి.
  2. ఈ మ్యాచ్​లో టాస్​ కూడా టీమ్​ఇండియాకు ప్రతికూలంగా మారిందనే చెప్పాలి.
  3. పాక్ టాస్ గెలవడం వల్ల బౌలింగ్​ ఎంచుకుంది. రెండో ఇన్నింగ్స్​ తేమ ప్రభావం వల్ల టీమ్​ఇండియా బౌలింగ్​లో అంతగా ప్రభావం చూపలేకపోయింది.
  4. అలానే భారత జట్టులో కెప్టెన్ కోహ్లీ(57), పంత్(39) మినహా మిగిలిన బ్యాట్స్​మన్ అందరూ చేతులెత్తేశారు.
  5. భారత్-పాక్ మ్యాచ్​ అంటే ఒత్తిడి సహజం. అది ఉండటం వల్ల మన బ్యాట్స్​మెన్​ తడబడ్డారు. పాక్​ ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడారు. ఇదీ టీమ్​ఇండియా ఓటమికి ఓ కారణం కావొచ్చు.
  6. స్పెషలిస్ట్​ బ్యాట్స్​మన్​గా బరిలో దిగిన ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 11 పరుగులే చేసి ఔటయ్యాడు.
  7. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ బ్యాట్స్​మెన్ వికెట్లు తీయలేకపోయారు భారత బౌలర్లు. ఒకవేళ తీసుంటే ఆ జట్టుపై ఒత్తిడి పెరిగేదేమో!
  8. పాకిస్థాన్​పై గెలిచిన ఎనిమిది టీ20ల్లోనూ ధోనీనే కెప్టెన్​గా ఉన్నాడు. ఈ మ్యాచ్​లో 'ధోనీ మార్క్' మిస్ కావడం కూడా ఓటమికి కారణం కావొచ్చు.
  9. కోహ్లీకి కెప్టెన్​గా ఈ ఫార్మాట్​లో ఇదే చివరి టోర్నీ. అందువల్ల అతడిపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. అతడు బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ మిగతా బ్యాట్స్​మెన్​ నుంచి సహకారం అందుంటే గెలిచేందుకు అవకాశాలు ఉండేవి.

ఇదీ చదవండి:IND vs PAK: ఎంత ఎదురుచూసినా.. ఈసారి ఏ మాయ జరగలేదు!

Last Updated :Oct 25, 2021, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.