ETV Bharat / sports

Smart Ball Cricket: ఈ బంతి చాలా స్మార్ట్​ గురూ!

author img

By

Published : Aug 27, 2021, 7:36 AM IST

Updated : Aug 27, 2021, 11:45 AM IST

ప్రొఫెషనల్​ క్రికెట్​లోకి స్మార్ట్​ బంతి(Smart Ball Cricket) అడుగుపెట్టింది. కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​లో(Caribbean Premier League) ఈ బంతిని ఉపయోగించడం మొదలుపెట్టారు. మరి ఈ కొత్త బంతి విశేషాలు ఏంటంటే?

Caribbean Premier League: Smart Ball is used for first time in professional cricket
Smart Ball Cricket: ఈ బంతి చాలా స్మార్ట్​ గురూ!

కరీబియన్ ప్రీమియర్ లీగ్(Caribbean Premier League) గురువారం ఆరంభమైంది. ఎప్పటిలానే మొదలైంది. ఇందులో వింతేమీ లేదు. అయితే ఈసారి లీగ్ ద్వారా ప్రొఫెషనల్ క్రికెట్​లోకి స్మార్ట్ బంతి(Smart Ball Cricket) అడుగుపెట్టింది. ప్రముఖ బంతుల తయారీ సంస్థ కూకబూరాతో కలిసి స్పోర్ట్స్ టెక్నాలజీ కంపెనీ అయిన స్పోర్ట్స్​కోర్​ దీన్ని రూపొందించింది. మరి ఈ కొత్త బంతి కథాకమామిషు ఏమిటో చూద్దామా..

Caribbean Premier League: Smart Ball is used for first time in professional cricket
బంతి లోపలి నమూనా

ఏమిటీ?

లోపల ఎలక్ట్రానిక్ చిప్​ను అమర్చి ఈ బంతిని తయారు చేస్తారు. ఈ చిప్​కున్న సెన్సార్ల సాయంతో బంతి వేగం, స్పిన్, బౌలర్ శక్తి తదితర విషయాలను ఎప్పటి కప్పుడు తెలుసుకోవచ్చు.

ఎందుకు?

నేల మీద పడి బౌన్స్ అయిన తర్వాత కూడా దాని వేగాన్ని, స్పిన్(ఓ నిమిషానికి ఎన్నిసార్లు తిరుగుతుంది)ను తెలుసుకోవడమే ఈ బంతి ప్రత్యేకత. ఇప్పుడున్న సాంకేతికత ఆధారంగా బౌలర్ చేతి నుంచి విడుదలైన బంతి పిచ్​ను తాకే ముందు ఉన్న వేగాన్ని మాత్రమే కనుక్కుంటున్నారు. బంతిని వేసేందుకు బౌలర్ ఎంత శక్తి ఖర్చు చేశాడనే వివరాలూ ఈ స్మార్ట్ బంతితో తెలుస్తాయి.

ఎలా పనిచేస్తుంది?

బంతి లోపల చిప్​కు ఉండే సెన్సార్ల సాయంతో దాని వేగాన్ని, స్పిన్​నూ, బౌలర్ ఖర్చు చేసిన శక్తిని బ్లూటూత్ సాంకేతికత ద్వారా స్మార్ట్ వాచ్​, మొబైల్ ఫోన్​, కంప్యూటర్లలో చూడవచ్చు. దీని కోసం ఓ ప్రత్యేక యాప్ రూపొందించారు. ఈ యాప్​లో ఓ బటన్​ను నొక్కితే బంతిలోని సెన్సార్లు సమాచారాన్ని గ్రహించి వాటిని బ్లూటూత్ ద్వారా పంపిస్తాయి. ఆ పంపిన సమాచారం ఫోన్ లేదా కంప్యూటర్ తెరలపై సగటున 5 సెకన్లలోనే ప్రత్యక్షమవుతుంది. ఈ బంతిలోని చిప్​లో ఉండే బ్యాటరీ 30 గంటల పాటు పనిచేస్తుంది.

Caribbean Premier League: Smart Ball is used for first time in professional cricket
బంతి లోపల అమర్చే చిప్​

ఏమైనా తేడా ఉంటుందా?

సాధారణ కూకబూరా బంతిని పోలినట్లే ఈ స్మార్ట్ బంతి ఉంటుంది. సాంప్రదాయ కూకబూరా బంతిలోని కార్క్ రబ్బరు కోర్ను తొలగించే ఆ స్థానంలో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్​ను పెట్టారు. దీని వల్ల బంతి స్వభావంలో ఎలాంటి మార్పు రాదు. గేల్, రసెల్ లాంటి భారీ హిట్టర్లు బలంగా బాదితే బంతి పగిలిపోతుందేమోనన్న సందేహమూ అక్కర్లేదు.

ఇదీ చూడండి.. భారత రెజ్లింగ్​ను దత్తత తీసుకున్న ఉత్తరప్రదేశ్​

Last Updated : Aug 27, 2021, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.