ETV Bharat / sports

IND vs NZ: 'బౌల్ట్‌.. నా భార్యకు పుట్టిన రోజు కానుక ఇచ్చాడు'

author img

By

Published : Nov 18, 2021, 11:22 AM IST

న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​లో(IND vs NZ T20) తొలి మ్యాచ్​లో సూపర్​ ఇన్నింగ్స్​ ఆడాడు టీమ్​ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(surya kumar yadav news). అయితే, సూర్య ఇచ్చిన ఓ క్యాచ్‌ను బౌల్ట్‌ జారవిడిచాడు. దీనిపై మ్యాచ్‌ అనంతరం స్పందించిన సూర్య.. తన భార్య పుట్టినరోజున బౌల్ట్‌ ఇచ్చిన కానుక అది (క్యాచ్‌ వదలడం) అని సరదాగా వ్యాఖ్యానించాడు.

surya kumar yadav
సూర్య కుమార్ యాదవ్

న్యూజిలాండ్‌తో తొలి టీ20లో(IND vs NZ T20) టీమ్‌ఇండియా యువ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ (62) దంచికొట్టాడు. అయితే, అతడు కీలక ఇన్నింగ్స్‌ ఆడినా చివరి దశలో బౌల్ట్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రోహిత్‌ (48)తో కలిసి మ్యాచ్‌ గమనాన్ని మార్చేసిన సూర్య.. 17వ ఓవర్‌లో బౌల్డయ్యాడు. దీంతో టీమ్‌ఇండియా 144 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అయితే, సూర్య(surya kumar yadav news) 57 పరుగుల వద్ద ఉండగా ఓ షాట్‌ ఆడాడు. ఆ క్యాచ్‌ను బౌల్ట్‌ జారవిడిచాడు. మ్యాచ్‌ అనంతరం స్పందించిన సూర్య.. తన భార్య పుట్టినరోజున బౌల్ట్‌ ఇచ్చిన కానుక అది (క్యాచ్‌ వదలడం) అని సరదాగా వ్యాఖ్యానించాడు.

"ఈ మ్యాచ్‌లో కొత్తగా ఏమీ చేయలేదు. గత మూడు, నాలుగేళ్లుగా ఎలా ఆడుతున్నానో అలాగే బ్యాటింగ్‌ చేశా. నెట్స్‌లో ఎలాంటి సాధన చేస్తున్నానో దాన్నే మైదానంలోనూ రిపీట్ చేశాను. నా ఆట తీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకొంటాను. ఎలా ఆడితే మంచిదో ఆలోచిస్తాను. ఈ మ్యాచ్‌లో మంచు ప్రభావంతో బంతి తేలిగ్గానే బ్యాట్‌ పైకి వచ్చింది. దీంతో షాట్లు ఆడటం తేలికైంది. చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నా.. మేం గెలిచినందుకు సంతోషంగా ఉంది. అయితే, నేనే స్వయంగా ఈ మ్యాచ్‌ను గెలిపించి ఉంటే మరింత ఎక్కువగా ఆనందించేవాడిని. కానీ, ఇలాంటి పరిస్థితుల నుంచే మనం నేర్చుకొని ముందుకు సాగుతాం. బౌల్ట్‌ నా క్యాచ్‌ వదిలేసిన విషయానికి వస్తే.. ఈ రోజు నా భార్య పుట్టినరోజు. ఆమెకు అతడిచ్చిన సరైన బహుమానం" అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

కోహ్లీ త్యాగం మరువలేను..

కివీస్​తో మ్యాచ్​ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్​ యాదవ్.. టీ20 మాజీ సారథి కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. అరంగేట్ర మ్యాచ్​లో కోహ్లీ 3వ స్థానాన్ని తన కోసం త్యాగం చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్​లో ఓ మ్యాచ్​లోను కోహ్లీ తనను మూడో స్థానంలో పంపినట్లు చెప్పుకొచ్చాడు. కోహ్లీ వ్యవహరించిన తీరును ఎప్పటికీ మరువలేనని ప్రశంసించాడు. అయితే.. బ్యాటింగ్ ఆర్డర్​లో ఏ స్థానంలో వచ్చినా తనకు పర్వాలేదని అన్నాడు.

ఇదీ చదవండి:

సిరాజ్​ను కొట్టిన రోహిత్ శర్మ!.. వీడియో వైరల్

బాబర్‌ను కాదని వార్నర్‌కే 'ప్లేయర్ ఆఫ్​ ది టోర్నీ'.. ఎందుకలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.