ETV Bharat / sports

'అందుకే ఆ మ్యాచ్​లో సౌతాఫ్రికా గెలిచింది' - టెస్ట్​ రిజల్ట్​పై క్రికెట్​ గాడ్​ రివ్యూ!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 9:21 PM IST

Sachin Tendulkar India VS South Africa Test Series
Sachin Tendulkar India VS South Africa Test Series

Sachin Tendulkar India Vs South Africa : సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై పలువురు మాజీలు తమ అభిప్రాయాలను నెట్టింట వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కూడా ఈ ఆటను విశ్లేషించాడు. ఇంతకీ ఆయన ఏమాన్నాడంటే ?

Sachin Tendulkar India VS South Africa Test Series : సెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విరాట్‌ కోహ్లీ ఒంటరి పోరాటం, అంతక ముందు రోజు కేఎల్ రాహుల్ సెంచరీలు ఏమాత్రం తోడ్పడకపోవడం వల్ల మూడో రోజుకే మ్యాచ్​ ముగిసింది. అయితే ఈ మ్యాచ్​పై పలువురు టీమ్ఇండియా మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మ్యాచ్​ను టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ విశ్లేషించాడు. భారత బ్యాటర్ల షాట్ల ఎంపిక సరిగ్గా లేదంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

సౌతాఫ్రికా ఆటతీరు అద్భుతం. తొలి ఇన్నింగ్స్ తర్వాత ఆ జట్టు వెనకబడుతుందని నేను భావించాను. కానీ ఆ టీమ్ పేసర్లు అంచనాలనకు మించి బౌలింగ్ చేశారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో సఫారీల జట్టు అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్‌కు కూడా పిచ్ అనుకూలంగానే ఉంది. అయినప్పటికీ, బ్యాటర్లు షాట్లు ఆడిన తీరు బాగోలేదు. ఈ టెస్ట్ మ్యాచులో ఎల్గర్, జాన్సన్, బెడింగ్‌ హామ్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే పరిస్థితులకు అనుగుణంగా గొప్ప నైపుణ్యాలతో బాగా బ్యాటింగ్ చేశారు" అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

మ్యాచ్​ సాగిందిలా
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ ఘోర ఓటమితో ప్రారంభించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియాపై సఫారీలు ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉంది.

ఓవర్‌ నైట్‌ స్కోరు 256/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 408 పరుగులకు ఆలౌటై 163 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఎలాగైనా గెలవాలన్న కసితో ఓపెన‌ర్ డీన్ ఎల్గ‌ర్‌ (185) మైదానంలోకి దిగి పరుగుల వరద పారించాడు. మార్కో జాన్‌సేన్‌(84 నాటౌట్)తో క‌లిసి జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. అయితే డ‌బుల్ సెంచ‌రీదిశ‌గా దూసుకెళ్తున్న అత‌డ్ని శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయ‌డం వల్ల భార‌త జ‌ట్టు కాస్త ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత వచ్చిన గెరాల్డ్ కోఎట్జీ(18)ను కూడా అశ్విన్ పెవిలియన్ బాట పట్టించాడు. వెనువెంటనే వచ్చిన ర‌బాడ‌(1), బ‌ర్గ‌ర్‌(0)ల‌ను బుమ్రా ఔట్​ చేసి సఫారీల ఇన్నింగ్స్​కు తెరదించాడు.

హిట్​మ్యాన్​పై మాజీలు ఫైర్​- 'రోహిత్ శర్మ చేసిన పెద్ద తప్పు అదే'

అభిమానుల మనసులు గెలుచుకున్న రాహుల్! వీడియో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.