ETV Bharat / sports

తనకు సాయం చేసినవారితో మాట్లాడిన పంత్​.. ఆస్పత్రిలోని ఫొటో వైరల్​!

author img

By

Published : Jan 3, 2023, 11:00 AM IST

కారు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అయితే అతడికి సంబంధించిన ఓ లేటెస్ట్​ ఫొటో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

Rishabh Pant recovery photo after accident
rishabh pant

ఇటీవలే కారు ప్రమాదంలో గాయపడ్డ టీమ్ఇండియా ప్లేయర్​ రిషభ్ పంత్ దెహ్రాదూన్​లో ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పలు శస్త్రచికిత్సల తర్వాత ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న పంత్​ ఇప్పుడు కోలుకుంటున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పడు పంత్​ను ప్రత్యేక వార్డుకు మార్చారు. ఈ క్రమంలో ఆస్పత్రిలోని అతడి ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

రోడ్డు ప్రమాద సమయంలో రిషభ్​కు సాయపడ్డ రజత్ కుమార్​, నిషు కుమార్​ అనే యువకులు.. పంత్ పోగుట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేందుకు మ్యాక్స్ ఆస్పత్రికి వచ్చారు. యువకులు వచ్చారని తెలుసుకున్న పంత్​ వారిని పిలిపించి కృతజ్ఞతలు తెలిపారు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటొలో రిషబ్​ చేయి కనిపిస్తోంది. ఇందులో రిషభ్ ముఖం కనిపించనప్పటికీ ఫ్యాన్స్​ ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. తమ అభిమాన ప్లేయర్​ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Rishabh Pant recovery photo after accident
రిషభ్​ పంత్​ వైరల్​ ఫొటో
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.