Ravindra Jadeja CSK: సీఎస్కే కెప్టెన్​గా రవీంద్ర జడేజా..!

author img

By

Published : Jan 15, 2022, 4:16 PM IST

dhoni, jadeja

Ravindra Jadeja CSK: ఈ సారి ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ సారథిగా రవీంద్ర జడేజా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఇప్పటికే పలువురు మాజీలు కూడా ధోనీ తర్వాత సీఎస్కే కెప్టెన్​ అయ్యే అర్హత జడేజాకే ఉందని అభిప్రాయపడ్డారు.

Ravindra Jadeja CSK: ఐపీఎల్ 2022 నిర్వహణ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 12, 13న మెగా వేలం ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్​ జట్టు కెప్టెన్​ అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. ధోనీ సారథ్యంలో ఇప్పటికే నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది సీఎస్కే. అయితే.. ఈ ఏడాది ధోనీ కెప్టెన్​గా కొనసాగుతాడా? లేదా? అన్న అంశంపై కొంతకాలం నుంచి సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో చెన్నై యాజమాన్యం ధోనీ స్థానంలో జడేజాకు కెప్టెన్​ పగ్గాలు అప్పగించనుందనే వార్తలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. గతంలో పలువురు మాజీలు కూడా సీఎస్కేను నడిపించే సామర్థ్యం ఉన్న ఆటగాడు జడేజానే అని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే పలు ఫ్రాంఛైజీలు తాము రిటైన్​ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. సీఎస్కే యాజమాన్యం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (రూ.16 కోట్లు), ధోనీ (12 కోట్లు), మొయీన్ అలీ (రూ.8 కోట్లు)‌, రుతురాజ్‌ (రూ. 6 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. ఈ నిర్ణయం ద్వారా యాజమాన్యం కూడా ధోని తర్వాతి కెప్టెన్‌ ఎవరో చెప్పకనే చెప్పినట్లయింది!

మరోవైపు, ధోనీ ఎంతకాలం సీఎస్కే తరఫున ప్రాతినిధ్యం వహిస్తాడన్న విషయంపై పూర్తిగా స్పష్టత లేదు. కానీ, ఓ సందర్భంలో ధోనీ మాట్లాడుతూ.. తన చివరి ఐపీఎల్​ మ్యాచ్​ చెన్నైలోని చెపాక్ వేదికగా ఆడుతానని పేర్కొన్నాడు.

ఇప్పటివరకు జడేజా 200 ఐపీఎల్​ మ్యాచ్​లు ఆడగా.. 2386 పరుగులు చేశాడు. 127 వికెట్లు పడగొట్టాడు. ఫీల్డర్​గా గొప్పగా రాణించాడు.

ఇదీ చదవండి:

వార్నర్​కు పోటీగా జడేజా.. 'పుష్ప' వీడియోతో 'తగ్గేదే లే'

ధోనీకి కేకేెఆర్​ పంచ్.. జడేజా దిమ్మతిరిగే కౌంటర్

csk captain 2022: ధోనీ తర్వాత సీఎస్కే కెప్టెన్​ అతడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.