ETV Bharat / sports

Prithvi Shaw Century : పృథ్వీ షా మళ్లీ మరో సెంచరీ.. వామ్మో ఆపడం ఎవరి వల్ల కావట్లేదుగా..

author img

By

Published : Aug 13, 2023, 9:43 PM IST

Updated : Aug 13, 2023, 10:23 PM IST

Royal London One Day Cup 2023 Prithvi Shaw Century : పృథ్వీ షా ఫుల్ ఫామ్​లో ఉన్నాడు. ఎక్కడా తగ్గట్లేదు. రీసెంట్​గా డబుల్​ సెంచరీతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అతడు.. మరోసారి సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ వివరాలు..

Prithvi Shaw Century : పృథ్వీ షా మళ్లీ మరో సెంచరీ.. వామ్మో ఆపడం ఎవరి వల్ల కావట్లేదుగా..
Prithvi Shaw Century : పృథ్వీ షా మళ్లీ మరో సెంచరీ.. వామ్మో ఆపడం ఎవరి వల్ల కావట్లేదుగా..

Prithvi Shaw Century : రాయల్‌ లండన్‌ వన్డే కప్‌-2023లో టీమ్​ఇండియా యంగ్ ప్లేయర్​ పృథ్వీ షా దూకుడు ఆగట్లేదు. అతడి ఫామ్​ను ఎవ్వరు ఆపే పరిస్థితిలో కనపడట్లేదు. అతడు ఇప్పుడు మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు(Royal London One Day Cup 2023 Prithvi Shaw). నార్తంప్టన్‌షైర్‌ ఓపెనర్‌ అయినా అతడు.. నాలుగు రోజుల కిందట ఆగస్ట్‌ 9 సోమర్‌సెట్‌పై డబుల్ సెంచరీతో విధ్వంసకర ఇన్నింగ్స్​ ఆడిన సంగతి తెలిసింది. 153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఇప్పుడు మళ్లీ నేడు(ఆగస్ట్‌ 13) డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో మెరుపు సెంచరీ చేశాడు. మొత్తం 76 బంతులు ఆడిన అతడు.. 15 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 125 అజేయ పరుగులు చేసి తన టీమ్​ను ఒంటిచేత్తో గెలిపించాడు.

మొదట బ్యాటింగ్‌ చేసిన డర్హమ్‌ టీమ్​ 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం నార్తంప్టన్‌షైర్‌ 25.4 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది.

లూక్‌ ప్రాక్టర్‌ దెబ్బకు పేకమేడలా.. పేసర్‌ లూక్‌ ప్రాక్టర్‌ (9-0-34-4) దెబ్బకు డర్హమ్‌ జట్టు 198 పరుగులకే కుప్పకూలిపోయింది. ప్రాక్టర్‌తో పాటు జేమ్స్‌ సేల్స్‌ (8-1-31-2), కియోగ్‌ (5.2-0-35-2), జాక్‌ వైట్‌ (10-0-49-1), కెర్రిగన్‌ (4-0-22-1) కూడా రాణించడం వల్ల డర్హమ్‌ జట్టు వేరే దిక్కులేక ఆలౌట్ అయిపోయింది. డర్హమ్‌ ఇన్నింగ్స్‌లో ట్రెవాస్కిస్‌ (37) హైయెస్ట్​ స్కోరు. ఆ తర్వాత అలెక్స్‌ లీస్‌ (34), బుష్‌నెల్‌ (32) మోస్తర్​ ఇన్నింగ్స్ ఆడారు. బోర్త్‌విక్‌ (20), ప్రిటోరియస్‌ (20) పరుగులు చేశారు.

Royal London One Day Cup 2023 Prithvi Shaw : పృథ్వీ షా సెంచరీతో... ఇక 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్‌షైర్‌.. ఓపెనర్‌ పృథ్వీ షా మెరుపు సెంచరీతో విజయాన్ని అందుకుంది. అతడికి రాబ్‌ కియోగ్‌ (42) తోడుగా నిలవడంతో లక్ష్యాన్ని ఈజీగా ఛేదించారు. ఎమిలియో గే (17), సామ్‌ వైట్‌మన్‌ (4), లూక్‌ ప్రాక్టర్‌ (3) వరుసగా ఫెయిల్ అయ్యారు. డర్హమ్‌ బౌలర్లలో జార్జ్‌ డ్రిస్సెల్‌ 3 వికెట్లు తీయగా.. బుష్‌నెల్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

Prithvi Shaw Double Century Scorecard : పృథ్వీ షా ఊచకోత​.. 28 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్​

Prithvi Shaw Hit Wicket : పాపం షా.. అరంగేట్ర మ్యాచ్​లో చేదు అనుభవం

Last Updated :Aug 13, 2023, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.