ETV Bharat / sports

PAK VS SA World Cup 2023 : నరాలు తెగే ఉత్కంఠ.. పాక్​పై ఒక్క వికెట్ తేడాతో సౌతాఫ్రికా విజయం

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 10:36 PM IST

Updated : Oct 28, 2023, 8:40 AM IST

PAK VS SA World Cup 2023 : శుక్రవారం దక్షిణాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో పాకిస్థాన్ ఓడిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తెసింది. 91 పరుగులతో ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ రాణించాడు. అయితే, దక్షిణాఫ్రికా జట్టును విజయ తీరాలకు చేర్చింది మాత్రం ఆ జట్టు టెయిలెండర్లే.

PAK VS SA World Cup 2023
PAK VS SA World Cup 2023

PAK VS SA World Cup 2023 : వన్డే ప్రపంచకప్​లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ టీం చేతులెత్తేసింది. శుక్రవారం దక్షిణాఫ్రికాతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్​లో పాక్ ఓటమి పాలైంది. భారత్‌ చేతిలో పరాజయాన్ని అందుకున్న తర్వాత పాకిస్థాన్‌ మళ్లీ గెలుపు రుచే చూడలేకపోయింది. గత మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ చేతిలో కంగుతిన్న పాక్‌.. ఇప్పుడు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో దక్షిణాఫ్రికాపై గొప్పగా పోరాడినా చివరికి ఓటమి వైపే నిలిచింది. ప్రపంచకప్‌ చరిత్రలోనే ఆ జట్టు తొలిసారి వరుసగా నాలుగో ఓటమి చవిచూసింది. దీంతో సెమీస్‌ రేసులో నిలిచే అవకాశాన్ని మరింత సంక్లిష్టం చేసుకుంది పాక్​. ఒక్క వికెట్ తేడాతో సౌతాఫ్రికా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది దక్షిణాఫ్రికా.

మొదట టాస్​ గెలిచి బ్యాంటింగ్​కు దిగిన పాకిస్థాన్​.. 271 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు టెంబా బవుమా (28), క్వింటన్‌ డికాక్‌ (24), రసీ వాన్‌ డెర్‌ డసన్‌ (21) మంచి ఆరంభాలను వృథా చేసుకుంటూ ఔట్ అయ్యారు. డికాక్‌ దూకుడుగా ఆడి షహీన్‌ అఫ్రిదీ బౌలింగ్‌లో మహ్మద్‌ వాసిమ్‌కు చిక్కాడు. బవుమాను వాసిమ్‌ ఔట్‌ చేశాడు. రసీ వాన్‌ డెర్‌ డసన్‌ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందిగానే ఆడాడు. ఆఖరికి ఉస్మాన్‌ మిర్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

అయిడెన్‌ మార్‌క్రమ్‌ సెంచరీ.. దక్షిణాఫ్రికా గెలుపులో కీలక పాత్ర పోషించాడు ఎయిడెన్‌ మార్‌క్రమ్‌(91; 93 బంతుల్లో 7×4, 3×6). తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ 91 పరుగులు సాధించాడు. అయితే చివర్లో విజయం దోబూచులాడింది. విజయానికి 20కి పైగా పరుగులు కావాల్సిన దశలో దక్షిణాఫ్రికా జట్టు ప్రధాన బ్యాటర్లంతా పెవీలియన్​కు చేరారు. అలా దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల పాక్ పుంజుకున్నట్లైంది. ఓ దశలో విజయం పాక్​ చేతిలోకి వెళ్లిపోయినట్టే కనిపించింది.

ఇక విజయానికి... పాక్​కు ఒక్క వికెట్టే ఉండగా దక్షిణాఫ్రికా 27 బంతుల్లో 11 పరుగులు చేయాలి. అప్పుడు 46వ ఓవర్‌ చివరి బంతికి రవూఫ్‌.. షంసి (4 నాటౌట్‌)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నట్లే కనిపించాడు. కానీ గట్టిగా అప్పీల్‌ చేసినా అంపైర్‌ ఔట్ ఇవ్వలేదు. సమీక్షకు వెళ్తే అది అంపైర్‌ కాల్‌ అని తేలడం వల్ల పాక్‌కు నిరాశ తప్పలేదు. ఇక ఆ తర్వాత ఓ ఎండ్‌లో పట్టుదలతో నిలిచిన కేశవ్‌ మహరాజ్‌ (7 నాటౌట్‌).. 48వ ఓవర్లలో ఫోర్‌ కొట్టడంతో పాక్‌ ఆశలు ఆవిరయ్యాయి.

పాకిస్థాన్​ ఆలౌట్..​ అంతకుముందు, పాకిస్థాన్​ టీంలో సౌద్ షకీల్, కెప్టెన్​ బాబర్​ ఆఫ్​ సెంచరీలు చేశారు. షాదాబ్ ఖాన్ 43 పరుగులు చేశాడు. కాగా మిగతా బ్యాటర్లు రాణించకపోవడం వల్ల 46.4 ఓవర్లకే పాకిస్థాన్​ ఆలౌట్​ అయింది.

ODI World Cup 2023 : పాకిస్థాన్ కొంపముంచిన 'అంపైర్స్ కాల్'!.. ఇప్పుడంతా దీని గురించే పెద్ద రచ్చ

Virat Kohli Fitness Diet : వరల్డ్​ కప్​ కోసం కోహ్లీ ప్రత్యేక డైట్​.. ఏం తింటున్నాడో తెలుసా?

Last Updated :Oct 28, 2023, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.