ETV Bharat / sports

ODI World Cup 2023 Players Injuries : సెమీస్​ రేసులో భయపెడుతున్న ఆటగాళ్ల గాయాలు.. జట్లకు పెద్ద షాక్​లు!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 11:04 AM IST

ODI World Cup 2023 Players Injuries : వన్డే ప్రపంచకప్​ సెమిస్ రేసు మంచి ఆసక్తికరంగా మారింది. ప్రతి జట్టు ప్రతి మ్యాచ్​ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే కొన్ని జట్లలోని కీలక ఆటగాళ్లు గాయపడతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యర్థుల కంటే ఆటగాళ్ల గాయాలే జట్లను ఇబ్బంది పెడుతున్నాయి.

ODI World Cup 2023 Players Injuries : జట్లను కలవరపెడుతున్న కీలక ఆటగాళ్లు..
ODI World Cup 2023 Players Injuries : జట్లను కలవరపెడుతున్న కీలక ఆటగాళ్లు..

ODI World Cup 2023 Players Injuries : ప్రపంచకప్ 2023 మెగా టోర్నీ హోరాహోరీగా జరుగుతూ.. రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ లాంటి పెద్ద టీమ్స్​కు పసికూన జట్లు షాక్​ ఇవ్వటం.. సంచలన విజయాలతో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అన్ని జట్లు ప్రతీ మ్యాచ్​ను కీలకంగా తీసుకుంటున్నాయి. అయితే జట్లుకు ప్రత్యర్థుల కంటే మరో విషయం భయపెడుతోంది. అదే తమ కీలక ఆటగాళ్ల గాయాలు. మ్యాచ్​ల ఫలితాల కన్నా కూడా ప్లేయర్ల గాయాలే జట్లకు ప్రతికూలంగా మారే అవకాశాలు ఎక్కువని చెప్పొచ్చు.

టీమ్​ఇండియా విషయానికొస్తే.. వరుస విజయాలతో రేస్​లో దూసుకుపోతోంది. అయితే తాజాగా స్టార్ ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య గాయానికి గురి కావటం టీమ్​కు షాక్​ అనే చెప్పాలి. బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో తన బౌలింగ్​లోనే బంతిని ఆపే ప్రయత్నంలో అతని కుడి కాలు చీలమండకు గాయమైంది. పాండ్య జట్టులో ఎంతో కీలకమైన ఆటగాడు.. ఈ గాయం వల్ల జట్టుపై తీవ్ర ప్రభావం చూపే ఆస్కారముంది. టీమ్​ఇండియాలో హార్దిక్​ ఒక్కడే పేస్ ఆల్​రౌండర్​. శార్దుల్ ఉన్నపటికీ.. టోర్నీ ప్రారంభమయ్యాక అతని పేలవ బౌలింగ్​తో నిరాశపరుస్తున్నాడు. దీంతో అయిదో బౌలర్​ భారాన్ని హార్దిక్ మోస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్​లో మూడు మ్యాచ్​ల్లో కలిపి అయిదు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ ఉంటే అటు బౌలింగ్​లోను, ఇటు బ్యాటింగ్​లోనూ జట్టుకు అదనపు అవకాశాలు అందుబాటులో ఉంటాయి. పైగా జట్టుకు వైస్ కెప్టెన్​ కూడా. ఇలాంటి ఆటగాడు దూరమైతే జట్టుపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అతను త్వరగా కోలుకుని జట్టులోకి రావలన్నది అభిమానుల ఆకాంక్ష.

మరోవైపు మిగతా జట్లకు కూడా ఇలాంటి ఆందోళనే కలవరపెడుతోంది. బంగ్లాదేశ్​కు కీలక ఆటగాడైన​ ఆల్​రౌండర్ షకిబ్​ అల్ హసన్ గాయం కారణంగా డగౌట్లో కూర్చోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో షకిబ్​కు ఎడమ తొడ కండరాల గాయమైంది. దీంతో భారత్​ మ్యాచ్​కు దూరమయ్యాడు. ఇక న్యూజిలాండ్ సారథి కేన్​ విలికయమ్సన్​ అయితే గాయాలతో సహవాసం చేస్తున్నాడనే చెప్పాలి. ప్రపంచకప్​లో న్యూజిలాండ్ తొలి రెండు మ్యాచ్​ల్లో విలికయమ్సన్​ ఆడలేదు. ఈ ఏడాది ఐపీఎల్​లో గాయపడ్డ అతను.. ఏడు నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్​ మ్యాచ్​లో ఆడాడు. అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కానీ, ఫీల్డర్ విసిరిన బంతి బొటనవేలికి తాకడం వల్ల గాయంతో మధ్యలోనే మైదానం వీడాడు. బొటనవేలు విరగడం వల్ల అఫ్గానిస్థాన్​ మ్యాచ్​కు దూరంగా ఉన్నాడు.

ఇకపోతే శ్రీలంక కెప్టెన్​ శానక.. పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో తొడ కండరాల గాయానికి గురయ్యాడు. కోలుకోవడానికి మూడు వారాలు పట్టే అవకాశం ఉండటం వల్ల స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇంగ్లాడు ఆటగాడు బెన్​ స్టోక్స్ తుంటి గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న పాకిస్థాన్‌ ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ కోలుకునేందుకు మరో వారం పట్టేలా ఉంది. ఇలా కీలకమైన ఆటగాళ్లు మ్యాచ్​లకు దూరం అవుతుంటే.. ఆ జట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది.

Ravindra Jadeja ODI World CUP 2023 : జడ్డూ భయ్యా అదరగొట్టేస్తున్నాడు.. అతడి గేమ్​ ప్లాన్ సీక్రెట్​ ఇదే!

Hardik Pandya Injury Replacement : హార్దిక్ స్థానంలో ఛాన్స్ ఎవరికో! సెలెక్టర్ల మొగ్గు వారివైపేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.