ETV Bharat / sports

'టీ-20 సిరీస్​లు అసలే వద్దు.. వాటినెవరు గుర్తుపెట్టుకుంటారు'

author img

By

Published : Jun 1, 2022, 4:06 PM IST

ఇటీవలే ఐపీఎల్​ ముగిసిన నేపథ్యంలో టీ-20 ఫార్మాట్​పై సరికొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చాడు టీమ్​ఇండియా మాజీ కోచ్​ రవి శాస్త్రి. ద్వైపాక్షిక టీ-20 సిరీస్​లు అవసరం లేదని.. ఇక వరల్డ్​కప్​, ఫ్రాంఛైజీ క్రికెట్​లోనే టీ20 మ్యాచ్​లు ఆడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు ఎందుకలా అన్నాడంటే?

No one remembers bilateral T20 series, play shortest format in just World Cup: Shastri
No one remembers bilateral T20 series, play shortest format in just World Cup: Shastri

Ravi Shastri T20 Format: టీ-20 మ్యాచ్​లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్​ఇండియా మాజీ హెడ్​ కోచ్​ రవి శాస్త్రి. ద్వైపాక్షిక టీ-20 సిరీస్​లు అవసరం లేదని, పొట్టి ఫార్మాట్​ క్రికెట్​ను కేవలం ప్రపంచ కప్​కే పరిమితం చేయాలని అన్నాడు. ఐపీఎల్​ వంటి ఫ్రాంఛైజీ క్రికెట్​, వరల్డ్​కప్​లోనే టీ-20 మ్యాచ్​లను ప్రేక్షకులు కోరుకుంటున్నారని, అదే అసలైన మజా ఇస్తుందని కామెంట్స్​ చేశాడు. సౌతాఫ్రికాతో భారత్​ 5 మ్యాచ్​ల టీ-20 సిరీస్​ ఆడనున్న నేపథ్యంలో శాస్త్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

''ఫుట్​బాల్​ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. టీ-20 క్రికెట్లో వరల్డ్​కప్​ మాత్రమే ఆడాలి. ద్వైపాక్షిక టోర్నమెంట్లను ఎవరూ గుర్తుపెట్టుకోరు. టీమ్​ఇండియా కోచ్​గా ఉన్న గత ఆరేడేళ్లల్లో వరల్డ్​కప్​ మినహాయించి ఒక్క టీ-20 మ్యాచ్​ కూడా నాకు గుర్తులేదు. జట్టు వరల్డ్​కప్​ గెలవాలి. అది అంతా గుర్తుపెట్టుకుంటారు. దురదృష్టవశాత్తు మేం గెలవలేదు. అందుకే నాకేమీ గుర్తులేదు.''

- రవి శాస్త్రి, టీమ్​ఇండియా మాజీ కోచ్​

ఐపీఎల్​ భవిష్యత్తు గురించి వచ్చిన చర్చలో.. ప్రతి క్యాలెండర్​ ఇయర్​లో రెండు సార్లు ఐపీఎల్​ నిర్వహించాలని అన్నాడు కామెంటేటర్​, ఇండియా మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా. త్వరలోనే ఇది సాకారమయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. చోప్రాతో ఏకీభవించిన శాస్త్రి.. అలా చేస్తేనే ఐపీఎల్​కు భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి వరుసగా నాలుగేళ్లు టీమ్​ఇండియా హెడ్​ కోచ్​గా పనిచేశాడు. తన కోచింగ్​లో భారత టెస్టు జట్టు నెం.1కు చేరింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు వెళ్లింది. విదేశాల్లో టెస్టు సిరీస్​లు గెలిచింది.

ఐపీఎల్​ 2022 సీజన్​ మే 29న ముగిసింది. పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన కొత్త జట్టు గుజరాత్​ టైటాన్స్​ కప్పు ఎగరేసుకుపోయింది. ఫైనల్లో రాజస్థాన్​ రాయల్స్​ను చిత్తుచేసింది. 2022 అక్టోబర్​ 16న టీ-20 ప్రపంచకప్​ సంగ్రామం షురూ కానుంది. డిఫెండింగ్​ ఛాంపియన్స్​ ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 16 జట్లు 45 మ్యాచ్​లు ఆడనున్నాయి. సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ-20 సిరీస్​ జూన్​ 9న మొదలవనుంది.

ఇవీ చూడండి: 'అబ్బాయినైతే బాగుండు.. ఆ 'నొప్పి' ఉండేదే కాదు'.. క్రీడాకారిణి భావోద్వేగం

ఆ టీ20 సిరీస్​పై టీమ్​ఇండియా కన్ను.. జూన్​ 5న దిల్లీకి పయనం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.