ETV Bharat / sports

ఇర్ఫాన్ పఠాన్-​ అమిత్​ మిశ్రా ట్విట్టర్​ వార్​.. కారణమేంటి?

author img

By

Published : Apr 22, 2022, 4:56 PM IST

Irfan Pathan Amit Mishra: దేశ భవిష్యత్తుపై టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్​ పఠాన్​ చేసిన ఓ ట్వీట్​ మాటల యుద్ధానికి దారి తీసింది. ఇర్ఫాన్​ ట్వీట్​కు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు క్రికెటర్​ అమిత్​ మిశ్రా. ఇంతకీ ఆ ట్వీట్​ ఏమిటి?

Irfan Pathan Amit Mishra
దేశ సత్తాపై ఇర్ఫాన్ పఠాన్​ ట్వీట్

Irfan Pathan Amit Mishra: భారత్​ వెటరన్​ క్రికెటర్లు ఇర్ఫాన్​ పఠాన్​, అమిత్​ మిశ్రా మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా మాటల యుద్ధం మొదలైంది. భారత భవిష్యత్తును ఉద్దేశించి శుక్రవారం ఉదయం ఓ ట్వీట్​ చేశాడు టీమిండియా మాజీ పేసర్​ ఇర్ఫాన్​. దానికి తనదైన శైలీలో సమాధానమిచ్చాడు అమిత్​ మిశ్రా. ఇంతకీ ఇరువురి మధ్య ట్విట్టర్​ వార్​కు దారితీసిన అంశం ఏమిటి?

భారత సత్తాను పేర్కొంటూ శుక్రవారం ఉదయం ఓ ట్వీట్​ చేశాడు ఇర్ఫాన్​. ' నా దేశం, నా అందమైన దేశం, ఈ భూమండలంపైనే గొప్ప దేశంగా ఎదిగే సత్తా ఉంది. కానీ...' అంటూ తన వాక్యాన్ని పూర్తి చేయకుండా వదిలేశాడు. ప్రస్తుతం దేశంలోని సామాజిక, రాజకీయ అంశాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా దేశంలో మతపరమైన హింస ఘటనలు జరుగుతున్నాయి. హనుమాన్​ జయంతి రోజున పలు ప్రాంతాల్లో రాళ్లదాడులు వెలుగుచూశాయి. వాటిని సూచిస్తూ ఇర్ఫాన్​ ట్వీట్​ చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

  • My country, my beautiful country, has the potential to be the greatest country on earth.BUT………

    — Irfan Pathan (@IrfanPathan) April 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇర్ఫాన్​ ట్వీట్​ చేసిన కొన్ని గంటల్లోనే దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాడు అమిత్​ మిశ్రా అదే మాదిరిగా ట్వీట్​ చేశాడు. 'నా దేశం, నా అందమైన దేశం, ఈ భూమండలంపై గొప్ప దేశంగా ఎదిగేందుకు సత్తా ఉంది. అయితే, అనుసరించేందుకు రాజ్యాంగమే తొలి పుస్తకమని కొందరు నమ్మినప్పుడే అది సాధ్యమవుతుంది.' అని పేర్కొన్నాడు. అయితే, ఇర్ఫాన్​ ట్వీట్​ను కోట్​ చేయటం, అతడి ట్వీట్​కు రిప్లై ఇవ్వటం చేయలేదు మిశ్రా.

  • My country, my beautiful country, has the potential to be the greatest country on earth…..only if some people realise that our constitution is the first book to be followed.

    — Amit Mishra (@MishiAmit) April 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: ధోనీ 'ఫినిష్‌' అనుకున్నావా.. ఫినిషర్‌.. సోషల్​ మీడియాలో ట్రెండింగ్​

ముంబయిలోనూ 'ధోనీ' మేనియా.. సింహం ఎక్కడైనా సింహమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.