ETV Bharat / sports

Rashid khan: 'అఫ్గాన్​ క్రికెటర్లు ఇద్దరూ​ ఐపీఎల్​లో ఆడతారు'

author img

By

Published : Aug 16, 2021, 1:18 PM IST

అఫ్గాన్ యువ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ.. ఐపీఎల్​లో ఆడటంపై స్పష్టత వచ్చేసింది. ఆ ఇద్దరూ యూఏఈలో జరిగే మ్యాచ్​ల్లో పాల్గొంటారని సన్​రైజర్స్ యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుతం రషీద్ ఖాన్.. యూకేలో టీ20 లీగ్​లో ఆడుతున్నాడు.

Rashid Khan
రషీద్ ఖాన్

ప్రస్తుతం అఫ్గానిస్థాన్​లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. తాలిబన్లు దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్న నేపథ్యంలో అఫ్గాన్​ క్రికెటర్లు రషీద్ ఖాన్, నబీ ఎక్కడున్నారు? త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్​లో ఆడతారా అనే ప్రశ్నలు అభిమానులకు వస్తున్నాయి. అయితే వారిద్దరూ మ్యాచ్​లకు అందుబాటులో ఉంటారని సన్​రైజర్స్ హైదరాబాద్​ సీఈఓ షణ్మగమ్ సోమవారం స్పష్టం చేశారు. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్​ రెండో దశ మ్యాచ్​లు జరగనున్నాయి.

అయితే అఫ్గానిస్థాన్​ ప్రస్తుత పరిస్థితిపై స్పిన్నర్ రషీద్ ఖాన్​ ఆందోళనగా ఉన్నాడని, అక్కడే ఉన్న తన కుటుంబాన్ని దేశం నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నాడని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ చెప్పాడు. ప్రస్తుతం 'ద హండ్రెడ్'లో ఆడుతున్న రషీద్.. యూకేలో ఉన్నాడు.

Rashid Khan
రషీద్ ఖాన్

ఏప్రిల్​లో కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్​ను తిరిగి యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. సెప్టెంబరు 19 నుంచి మొత్తంగా 31 మ్యాచ్​లు జరగనున్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలు ఒక్కొక్కటిగా ఆ దేశానికి చేరుకుంటున్నాయి. తొలి మ్యాచ్ చెన్నై సూపర్​కింగ్స్-ముంబయి ఇండియన్స్ మధ్య జరగనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.