ETV Bharat / sports

హైఓల్టేజ్ మ్యాచ్.. రాజస్థాన్ జోరుకు గుజరాత్ బ్రేకులు వేస్తుందా?

author img

By

Published : Apr 14, 2022, 9:34 AM IST

RR vs GT IPL 2022: ఐపీఎల్​లో గురువారం మరో హైఓల్టేజ్​ మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. టేబుల్​ టాపర్​ రాజస్థాన్​ రాయల్స్​తో గుజరాత్​ టైటాన్స్​ తలపడనుంది. హైదరాబాద్​ ఇచ్చిన షాక్​ నుంచి కోలుకుని ఆర్​ఆర్​ బ్యాటింగ్​ లైనప్​ను టైటాన్స్​ నిలువరిస్తుందా? ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఓసారి చూద్దాం.

RR vs GT IPL 2022
సంజూ శాంషన్​, హార్దిక్​ పాండ్యా

RR vs GT IPL 2022: ఐపీఎల్​ 2022 సీజన్​లో మరో రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది. బలమైన బౌలింగ్​, బ్యాటింగ్​ లైనప్​లతో దూసుకెళ్తున్న రాజస్థాన్​ రాయల్స్​, గుజరాత్​ టైటాన్స్​ గురువారం తలపడనున్నాయి. తొలి సీజన్​లోనే వరుస మ్యాచుల్లో విజయంతో దూకుడుగా ఉన్న గుజరాత్​ టైటాన్స్​కు గత మ్యాచ్​లో కళ్లెం వేసింది సన్​రైజర్స్​ హైదరాబాద్​. తొలి ఓటమిని రుచి చూపించింది. ఈ క్రమంలో.. గత మ్యాచ్​లో విజయంతో దూకుడు మీదున్న రాయల్స్​ను టైటాన్స్​ నిలువరిస్తుందా? హార్దిక్​ సేనను మట్టి కరిపించి రాయల్స్​ విజయాల పరంపరను కొనసాగిస్తుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే...

ఈ సీజన్​లో బౌలింగ్​లో అద్భుత ప్రదర్శనలు లేకపోయినా.. స్పిన్నర్లు, పేసర్లు ఉమ్మడిగా రాణిస్తూ రాజస్థాన్​ రాయల్స్​ను మేటి జట్లలో ఒకటిగా నిలుపుతున్నారు. కొత్త బంతితో ట్రెంట్​ బౌల్ట్​ నిప్పులు చెరుగుతున్నాడు. డెత్​ ఓవర్లలోనూ అంతే అద్భుతంగా బంతులు విసురుతుండటం జట్టుగా ప్రధానబలంగా మారింది. క్రితం మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్​పై తొలి ఓవర్​లోనే కెప్టెన్​ కేఎల్​ రాహుల్​, క్రిష్ణప్ప గౌతమ్​లను పెవీలియన్​ చేర్చి ఆ జట్టును దెబ్బకొట్టాడు. మరో ఎండ్​లో ప్రసిద్ధ్​ కృష్ణ వేగంగా బంతులు విసురతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్నాడు. యువ ఆటగాడు కుల్దీప్​ సేన్​ సైతం అద్భుతంగా బౌలింగ్​ చేస్తున్నాడు. అరంగేట్రం మ్యాచ్​లోనే ఒత్తిడిని జయించి చివరి ఓవర్లో 15 పరుగుల లక్ష్యాన్ని కాపాడి జట్టును గెలిపించాడు. స్పిన్నర్ల విషయానికి వస్తే.. టీమిండియా సీనియర్​ ప్లేయర్​ రవిచంద్రన్​ అశ్విన్​, యుజ్వేంద్ర చాహల్​లు తమ మాయాజాలాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సీజన్​లో 11 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో తొలిస్థానంలో కొనసాగుతున్నాడు చాహల్​.

రాజస్థాన్​ రాయల్స్​ బౌలింగ్​ను ఛేదించి పరుగులు రాబట్టటం టైటాన్స్​ బ్యాటర్లకు పరీక్షేనని చెప్పాలి. ఓపెనర్​ శుభమన్​ గిల్​, కెప్టెన్​ హార్దిక్​ పాండ్యాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది గుజరాత్​. మాథ్యూ వేడ్​ పరుగులు సాధించటంలో ఇబ్బందులు పడుతున్నాడు. డేవిడ్​ మిల్లర్​ ఇంకా తనదైన శైలిని అందుకోలేదు. దీంతో యువకులైన.. అభినవ్​ మనోహర్​, సాయి సుదర్షన్​లు ఆ బాధ్యతలను తీసుకోవాల్సి వస్తోంది. మ్యాచ్​ ఫినిషర్​గా రాహుల్​ తెవాతియా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రపంచస్థాయి ఫాస్ట్​ బౌలర్లలో ఒకడైన ఫెర్గుసన్, టీమిండియా సీనియర్​ ప్లేయర్ మహమ్మద్​ షమీ, పాండ్యాలు రాణిస్తూ ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెడుతున్నారు. రషీద్​ ఖాన్​ పొదుపుగా బౌలింగ్​ చేస్తూ తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. అయితే.. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో టైటాన్స్​ బౌలర్లు అంతగా ప్రభావం చూపకపోవటం జట్టును ఆలోచనలో పడేసింది. ఈ నేపథ్యంలో.. రాజస్థాన్​ రాయల్స్​ బలమైన బ్యాటింగ్​ లైనప్​ను ఏ విధంగా అడ్డుకుంటారనేది చూడాలి. ఐపీఎల్​ 15వ సీజన్​లో రెండు జట్లు నాలుగు మ్యాచ్​లు ఆడి మూడింట విజయం సాధించాయి. నెట్​రన్​ రేట్​తో పాయింట్స్​ టేబుల్​లో తొలిస్థానంలో కొనసాగుతోంది ఆర్​ఆర్​. గుజరాత్​ టైటాన్స్​ నెట్​రన్​ రేట్​ కాస్త తగ్గడం వల్ల నాలుగో స్థానానికి పరిమితమైంది.

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్​మెయర్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, రియాన్ పరాగ్, నాథన్ కౌల్టర్ నైల్, దేవదత్ పడిక్కల్, నవదీప్ సైనీ, కరుణ్ నాయర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, జేమ్స్ నీషమ్, అనునయ్ సింగ్, డారిల్ మిచెల్, ధ్రువ్ జురెల్, శుభమ్ గర్హ్వాల్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఓబెద్ మెక్కాయ్.

గుజరాత్ టైటాన్స్: అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, గుర్కీరత్ సింగ్, బి.సాయి సుదర్శన్, శుభ్​మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాహుల్ తెవాతియా, విజయ్ శంకర్, మాథ్యూ వేడ్​, రహ్మానుల్లా గుర్బాజ్, వృద్ధిమాన్ సాహా, అల్జారీ జోసెఫ్, దర్శన్ నల్కండే, డొమినిక్ డ్రేక్స్, జయంత్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, ప్రదీప్ సంగ్వాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, వరుణ్ ఆరోన్, యశ్ దయాళ్.​

ఇదీ చూడండి: IPL 2022: ముంబయికి షాక్​.. రోహిత్​కు భారీ జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.