IPL 2021: రోహిత్ శర్మ పేరిట రికార్డులే రికార్డులు!

author img

By

Published : Sep 19, 2021, 1:23 PM IST

Updated : Sep 19, 2021, 1:59 PM IST

IPL 2021 News: Rohit Sharma 3 Sixes Away From Becoming First India Batter to Record 400 Sixes in T20s

ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ.. మరో అరుదైన రికార్డుకు అడుగుదూరంలో ఉన్నాడు. మరో మూడు సిక్సులు కొటితే టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు(Rohit Sharma T20 Sixes) కొట్టిన భారత తొలి బ్యాట్స్​మన్​గా నిలుస్తాడు. అయితే ఆదివారం ఐపీఎల్​లో(IPL 2021) చెన్నైతో జరగనున్న తొలిమ్యాచ్​లోనే ఈ రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి.

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(IPL 2021) చరిత్రలో ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​(Mumbai Indians Captain) రోహిత్​ శర్మ పేరిట అనేక రికార్డులు ఉన్నాయి. ఐదు సార్లు ట్రోఫీని(Rohit Sharma IPL Titles) సాధించిన సారథిగా నిలిచిన ఏకైక ఐపీఎల్​ చరిత్రలో నిలిచాడు. అయితే హిట్​మ్యాన్​ పేరిట ఘనతలతో పాటు పలు చెత్త రికార్డులూ ఉన్నాయి. వాటి సంగతి ఇప్పుడు చూసేద్దాం.

హిట్​మ్యాన్​ పేరిట అరుదైన రికార్డు..

  • ఐపీఎల్​ 2011 సీజన్​లో ముంబయి ఇండియన్స్​ జట్టులో భాగమైన రోహిత్​ శర్మ.. తన నాయకత్వంలో ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిపాడు. ఇప్పటివరకు ఏ టీమ్​ ఐదు సార్లు ట్రోఫీని గెలిచింది లేదు. అయితే ఇది హిట్​మ్యాన్​ కెరీర్​లోనే కాకుండా.. ఐపీఎల్​ చరిత్రలో చెక్కు చెదరని రికార్డు.
  • ఐపీఎల్​లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు రోహిత్​ శర్మ. ఐపీఎల్​ కెరీర్​లో 207 మ్యాచ్​ల్లో 130 స్ట్రైక్​రేట్​తో 5480 పరుగులు(Rohit Sharma Runs In IPL) చేశాడు. అందులో ఒక సెంచరీ, 40 హాఫ్​సెంచరీలున్నాయి.
  • ఐపీఎల్​ లీగ్​లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్​మన్​(224)గా రోహిత్​ ఘనత సాధించాడు.

టీ20 క్రికెట్లో 400 సిక్సర్లు(Rohit Sharma T20 Sixes) కొట్టిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచేందుకు రోహిత్‌ శర్మకు అవసరమైన సిక్సర్లు 3. ప్రస్తుతం అతని ఖాతాలో 397 సిక్సర్లున్నాయి.

చెత్త రికార్డు..

ఐపీఎల్​లో అత్యధిక ట్రోఫీలు నెగ్గిన కెప్టెన్​ రోహిత్​ శర్మ.. అత్యధిక సార్లు డకౌట్​(Rohit Sharma IPL Ducks) అయిన బ్యాట్స్​మన్​గానూ చెత్తరికార్డు నమోదు చేశారు. లీగ్​లో ఏకంగా 13 సార్లు డకౌట్​ అయ్యాడు. ఇందులో మరో నలుగురు బ్యాట్స్​మెన్​ భాగమయ్యారు. వారిలో హర్భజన్​ సింగ్​, పార్ధివ్​ పటేల్​, రహానె, అంబటి రాయుడు ఉన్నారు. మనీష్ పాండే(12), గ్లెన్​ మ్యాక్స్​వెల్​(11), శిఖర్​ ధావన్​(11), రషీద్​ ఖాన్​(9), ఏబీ డివిలియర్స్​(9), సంజూ శాంసన్​(8), క్రిస్​ గేల్​(8), సురేశ్​ రైనా(8) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఐపీఎల్​ రెండోదశ ఆదివారం(సెప్టెంబరు 19) నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​తో ముంబయి ఇండియన్స్​(CSK Vs MI 2021) తలపడనుంది. ఈ మ్యాచ్​లో రోహిత్​ శర్మ 3 సిక్సర్లు సాధిస్తే.. టీ20ల్లో 400 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్​మన్​గా రోహిత్​ శర్మ రికార్డు సాధిస్తాడు.

ఇదీ చూడండి.. IPL 2021: ఐపీఎల్​లో ప్రేక్షకులు.. కానీ వారికి నో ఎంట్రీ!

Last Updated :Sep 19, 2021, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.