ETV Bharat / sports

IPL Mini auction: ఐపీఎల్‌ చరిత్రలో రికార్డ్‌ ధరకు సామ్ కరణ్​

author img

By

Published : Dec 23, 2022, 5:37 PM IST

Updated : Dec 23, 2022, 5:49 PM IST

ఐపీఎల్‌ మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ చరిత్ర సృష్టించాడు. ఆ వివరాలు..

IPL 2023 mini auction sam curran
IPL Mini auction: ఐపీఎల్‌ చరిత్రలో రికార్డ్‌ ధరకు శామ్ కరణ్​

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ మినీ వేలంలో అతడు రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. ఇవాళ జరిగిన వేలంలో కరన్‌ కోసం ముంబయి, పంజాబ్‌ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు రూ.18.50 కోట్లకు పంజాబ్‌ అతడిని దక్కించుకుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ పేరిట ఉంది. 2021లో జరిగిన మినీ వేలంలో మోరిస్‌ను రాజస్థాన్‌ జట్టు రూ.16.25కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడా రికార్డును సామ్‌ కరన్‌ బద్దలుకొట్టాడు.

రెండో స్థానంలో గ్రీన్‌.. ఇక ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ కూడా మోరిస్‌ రికార్డును దాటి ఐపీఎల్‌ వేలం చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. నేటి వేలంలో ముంబయి అతడిని రూ.17.50కోట్లకు దక్కించుకుంది.

వీరికీ భారీ ధరే.. తాజా వేలంలో మరికొంతమంది విదేశీ ఆటగాళ్లకు జాక్‌పాట్‌ తగిలింది.

  • ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ను చెన్నై రూ.16.25కోట్లతో సొంతం చేసుకుంది.
  • వెస్టిండీస్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ను లఖ్‌నవూ జట్టు రూ.16కోట్లకు దక్కించుకుంది.
  • ఇంగ్లాండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను హైదరాబాద్‌ జట్టు రూ.13.25 కోట్లకు సొంతం చేసుకుంది.
  • ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లు..
    సామ్‌ కరన్‌- రూ. 18.50 కోట్లు- పంజాబ్‌ కింగ్స్‌
    కామెరున్‌ గ్రీన్‌- రూ. 17.5 కోట్లు- ముంబయి ఇండియన్స్‌
    బెన్‌ స్టోక్స్‌- రూ.16.25 కోట్లు- సీఎస్‌కే
    క్రిస్‌ మోరిస్‌- రూ. 16.25 కోట్లు- రాజస్థాన్​​ రాయల్స్‌
    యువరాజ్‌ సింగ్‌- రూ. 16 కోట్లు- ఢిల్లీ డేర్‌డెవిల్స్‌
    పాట్‌ కమిన్స్‌- రూ. 15.5 కోట్లు- కేకేఆర్‌
    ఇషాన్‌ కిషన్‌- రూ. 15. 5 కోట్లు- ముంబయి ఇండియన్స్‌
    కైల్‌ జేమీసన్‌- రూ. 15 కోట్లు- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)
    బెన్‌ స్టోక్స్‌- రూ.14.50 కోట్లు- రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌
    దీపక్‌ చాహర్‌- రూ. 14 కోట్లు- సీఎస్‌కే

ఇదీ చూడండి: IPL Mini auction: మినీ వేలంలో అదరగొట్టిన తెలుగు కుర్రాడు

Last Updated : Dec 23, 2022, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.