IPL 2022: రషీద్​, గిల్​ అరుదైన రికార్డు.. సచిన్​, బ్రావో సరసన చోటు

author img

By

Published : May 11, 2022, 9:51 AM IST

Rashid khan record

IPL 2022 Rashid khan record: లఖ్​నవూతో జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​ విజయం సాధించి.. ఈ సీజన్​లో ప్లే ఆఫ్స్​ చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్​ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​ ఓ అరుదైన రికార్డు సాధించాడు. మరోవైపు శుభమన్​ గిల్​ కూడా ఓ ఘనత సాధించాడు. అదేంటంటే...

IPL 2022 Rashid khan record: ఐపీఎల్​ 2022లో భాగంగా లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సీజన్​లో ప్లే ఆఫ్స్​ చేరిన తొలి జట్టుగా గుజరాత్​ నిలిచింది. అయితే ఈ విజయంలో నాలుగు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించిన స్పిన్నర్​ రషీద్​ ఖాన్​ ఓ రికార్డు సాధించాడు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన 27 మ్యాచుల్లో 40 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. సందీప్ లమిచ్చానే(23 మ్యాచులు, 38 వికెట్లు), డ్వేన్​ బ్రావో(19, 34), జాసన్​ హోల్డర్​(17, 29) రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇక రషీద్​.. ఈ మ్యాచ్​ ద్వారా తన ఐపీఎల్​ కెరీర్​లో బెస్ట్ ఫిగర్స్​ నమోదు చేశాడు. 3.5 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. అంతకుముందు 2020 ఐపీఎల్​ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​పై(3 వికెట్లు/ 7 పరుగులు), పంజాబ్‌ కింగ్స్‌పై(3 వికెట్లు/12 పరుగులు) చేశాడు. మొత్తంగా ఈ సీజన్​లో ఇప్పటివరకు 15 వికెట్లు తీశాడు. దీంతో పాటే ఐపీఎల్​లో అతి తక్కువ వయసులో 100 వికెట్లు తీసిన యంగెస్ట్​ బౌలర్​ నిలిచిన రషీద్ మరో అరుధైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్​ చరిత్రలో 450 వికెట్లు తీసిన​ మూడో బౌలర్​గా నిలిచి.. దిగ్గజాలు డ్వేన్​ బ్రావో(వెస్టిండీస్​), ఇమ్రాన్​ తాహీర్(దక్షిణాఫ్రికా)​ సరసన చేరాడు.

అప్పుడు సచిన్‌.. ఇప్పుడు గిల్‌.. ఈ మ్యాచ్​లో గుజరాత్ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 63 నాటౌట్: 7 ఫోర్లు) ఓపెనర్‌గా వచ్చి 20 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉన్నాడు. ఇలాంటి సంఘటనే 2009 టీ20 లీగ్‌ టోర్నీలోనూ జరిగింది. అయితే అప్పుడు బ్యాటర్‌ టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్. ముంబయి జట్టు తరఫున ఆడిన సచిన్‌ చెన్నైపై ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. సరిగ్గా 49 బంతుల్లోనే ఏడు ఫోర్ల సాయంతో 59 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. అప్పుడు సచిన్, ఇప్పుడు గిల్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సరూ లేకపోవడం మరో విశేషం. 2009 సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై ముంబయి 19 పరుగుల తేడాతో విజయం సాధించగా.. ఇప్పుడు లఖ్‌నవూను 62 పరుగుల తేడాతో గుజరాత్ చిత్తు చేసింది.

కాగా, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అనంతరం 145 పరుగుల లక్ష్య ఛేదనలో లఖ్‌నవూ 82 పరుగులకే కుప్పకూలింది. రషీద్‌ ఖాన్‌ (4/24), సాయి కిశోర్ (2/7) యాష్ దయాల్ (2/24), షమీ (1/5) విజృంభించారు. లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో దీపక్‌ హుడా (27) టాప్‌ స్కోరర్‌. హుడాతో సహా డికాక్ (11), అవేశ్‌ ఖాన్‌ (12) మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. ఈ విజయంతో ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకున్న తొలి జట్టుగా గుజరాత్‌ మారింది.

ఇదీ చూడండి: Yuvaraj singh: కోట్లొస్తుంటే టెస్టులెందుకు ఆడతారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.