ETV Bharat / sports

అండర్సన్​ ఆన్ ఫైర్.. కుప్పకూలిన భారత టాపార్డర్

author img

By

Published : Aug 25, 2021, 4:58 PM IST

ఇంగ్లాండ్​తో జరుగుతున్న మూడో టెస్టులో భారత టాపార్డర్​ చేతులెత్తేసింది. అండర్సన్​ దాటికి తక్కువ వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది టీమ్ఇండియా. కోహ్లీ, పుజారా, రాహుల్ విఫలమయ్యారు.

india
భారత్

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మూడో టెస్టులో మొదట టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా టాస్​ ఓడిపోయిన కోహ్లీ ఈసారి టాస్ గెలవడం వల్ల అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు ఉండలేదు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్ రాహుల్ (0) డకౌట్​గా వెనుదిగిరాడు. అనంతరం పుజారా కూడా ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ కాసేపు కుదురుకునే ప్రయత్నం చేశాడు. రోహిత్​తో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దేలా కనిపించాడు. కానీ అండర్సన్​ మరోసారి భారత్​ను దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్​ 21 పరుగుల వద్ద కోహ్లీ(7)ని ఔట్ చేశాడు.

అండర్సన్​ ఆన్ ఫైర్

బ్రాడ్, వుడ్, ఆర్చర్​ లాంటి ప్రధాన బౌలర్లు లేకుండా బరిలో దిగింది ఇంగ్లాండ్. పేస్ బౌలింగ్​లో వీరికున్న ఒకే ఒక్క సీనియర్ బౌలర్ అండర్సన్. ఆ బాధ్యతను అతడు సక్రమంగా నిర్వర్తించాడు. ప్రారంభంలో పిచ్​ సహకారాన్ని అందుకుని టీమ్ఇండియా ప్రధాన బ్యాట్స్​మెన్​ను బోల్తా కొట్టించాడు. లార్డ్స్​ సెంచరీ హీరో రాహుల్​తో పాటు పుజారా, కోహ్లీని పెవిలియన్ చేర్చాడు. అన్ని ఫార్మాట్​లలో కలిపి విరాట్​ను 10 సార్లు ఔట్ చేశాడు అండర్సన్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.