ETV Bharat / sports

టీ20ల్లో వరల్డ్​ నెం.1గా సూర్య కుమార్ యాదవ్​.. ప్రపంచకప్​లో కోహ్లీ అద్భుత ఘనత

author img

By

Published : Nov 2, 2022, 2:23 PM IST

Updated : Nov 2, 2022, 3:10 PM IST

టీ20 ర్యాకింగ్స్​లో ప్రపంచ నెంబర్​ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాకింగ్స్​లో పాక్ ఓపెనర్​ మహ్మద్ రిజ్వాన్​ను వెనక్కునెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు కోహ్లీ.. టీ20 ప్రపంచకప్​ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్​గా నిలిచాడు.

icc t20 ranking batsman 2022
టీ20ల్లో ప్రపంచ నెం.1గా సూర్య కుమార్ యాదవ్​.. ప్రపంచకప్​లో కోహ్లీ ఘనత

జోరుమీదున్న టీమ్​ఇండియా విధ్వంసకర బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఐసీసీ తాజా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టేశాడు. 863 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ క్రికెట‌ర్ రిజ్వాన్‌ను(842 పాయింట్లు) వెన‌క్కి నెట్టి ఈ ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్​లో ఇప్ప‌టివ‌ర‌కు రెండు హాఫ్ సెంచ‌రీల‌తో ధనాధన్​ ఇన్నిగ్స్​ ఆడిన సూర్య‌.. మెన్స్ ర్యాంకింగ్స్‌లోనూ రాకెట్‌లా దూసుకెళ్తున్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్​లో సూర్య 68 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాతే ఈ మార్క్​ను అందుకున్నాడు. అలాగే ఇదే టోర్నీలో నెద‌ర్లాండ్స్‌పై కూడా కీల‌క హాఫ్ సెంచ‌రీ చేశాడు.

ఐసీసీ టీ20 బ్యాట‌ర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న 23వ క్రికెట‌ర్‌గా సూర్య నిలిచాడు. అలాగే రెండో భారత బ్యాటర్​గా కూడా నిలిచాడు. అంతకుముందు గ‌తంలో ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచిన ప్లేయ‌ర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఉన్నాడు.

కోహ్లీ ఘనత.. ప్రపంచ క్రికెట్​లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్​ అయిన విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా రికార్డుకెక్కాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్ లో 16 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. తద్వారా లంక మాజీ ప్లేయర్ జయవర్థనే పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. జయవర్దెనే.. టీ20 ప్రపంచకప్ లో 31 మ్యాచుల్లో (31 ఇన్నింగ్స్) 1,016 పరుగులు చేశాడు. కోహ్లీ 23 ఇన్నింగ్స్​లోనే జయవర్థనే రికార్డును అధిగమించి 1017 రన్స్​తో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో టాప్-5లో భారత సారథి రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. 921 రన్స్​తో నాలుగో స్థానంలో ఉండగా.. విండీస్​ వీరుడు గేల్​ 965 పరుగులతో 3వ స్థానం), శ్రీలంక ప్లేయర్​ దిల్షన్​ 897 రన్స్​ చేసి 5వ స్థానంలో నిలిచారు.

ఇదీ చూడండి: 'భారతీయుడు 2'లో టీమ్ఇం​డియా స్టార్​​ క్రికెటర్​ తండ్రి

Last Updated :Nov 2, 2022, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.