ETV Bharat / sports

అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. బాధగా ఉంది: శ్రేయస్​

author img

By

Published : Jul 25, 2022, 5:16 PM IST

భారత టీ20 లీగ్‌తో పాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ సిరీస్‌లలోనూ విఫలమైన టీమ్​ఇండియా బ్యాటర్ శ్రేయస్​ అయ్యర్​ మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అదరగొడుతున్నాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో తన ప్రదర్శనపై మాట్లాడాడు. ఏమి చెప్పాడంటే..

shreya iyer
శ్రేయస్ అయ్యర్​

టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్‌ ఫామ్‌లోకి వచ్చాడు. కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న అతడు.. వెస్టిండీస్‌పై బ్యాక్‌ టు బ్యాక్‌ హాఫ్‌ సెంచరీలు చేసి సత్తాచాటాడు. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో సంజూ శాంసన్‌తో కలిసి 99 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి టీమ్‌ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, ఇన్నింగ్స్‌ 33వ ఓవర్‌ అల్‌జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో అయ్యర్‌ (71 బంతుల్లో 63; 4 పోర్లు, 1 సిక్సర్‌ ) ఎల్బీ రూపంలో పెవిలియన్‌ చేరాడు.

అయితే తన ప్రదర్శనపై మాట్లాడిన అతడు.. "నేను సాధించిన పరుగులతో సంతోషిస్తున్న..అయితే నేను ఔట్‌ అయిన విధానం నన్ను నిరాశకు గురిచేసింది. జట్టుకు విజయాన్ని అందించేంతవరకు క్రీజ్‌లో ఉంటానని అనుకున్నా..కానీ, దురదృష్టవశాత్తు ఔట్‌ అయ్యాను. తరవాతి మ్యాచ్‌లో శతకం సాధిస్తానని భావిస్తున్నా" అని తెలిపాడు.

టీమ్‌ఇండియాపై విజయం గురించి మాట్లాడుతూ.. "వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పుడు సంజూ క్రీజ్‌లోకి వచ్చి మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై ఎదురుదాడి చేసి సిక్సర్లు రాబట్టాడు. దీంతో మ్యాచ్‌ మనవైపు తిరిగింది. చివర్లో అక్షర్ పటేల్‌ గొప్ప ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. అయితే, డగౌట్‌లో కూర్చున్నప్పుడు సరదాగా అనిపించింది. రాహుల్‌ సార్‌( ద్రవిడ్‌) టెన్షన్‌ పడుతున్నారు. ఆటగాళ్లతో సందేశాన్ని పంపుతున్నారు. అయితే, ఒత్తిడి సమయంలో సహచర ఆటగాళ్లు ప్రశాంతంగా కనిపిస్తూనే.. భావోద్వేగాలను వ్యక్తపరిచారు" అని శ్రేయస్‌ అన్నాడు. అతను వెస్టిండీస్‌పై ఆడిన ఎనిమిది వన్డేల్లో 71,65,70,53,7,80,54,65 పరుగులతో ఏడు అర్ధశతకాలు సాధించడం విశేషం.

ఇదీ చూడండి: పాక్​ రికార్డు బ్రేక్.. అగ్రస్థానంలో ​టీమ్​ఇండియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.