ETV Bharat / sports

IND vs SA 2nd Test: ఎల్గర్​ సూపర్ ఇన్నింగ్స్​- విజయం సౌతాఫ్రికాదే

author img

By

Published : Jan 6, 2022, 3:55 PM IST

Updated : Jan 6, 2022, 9:27 PM IST

ind vs sa
భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్

21:24 January 06

రెండో టెస్టు సఫారీలదే..

రెండో టెస్టులో భారత్​పై విజయం సాధించింది సౌతాఫ్రికా. 3 మ్యాచ్​ల సిరీస్​లో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో టెస్టు కేప్ టౌన్ వేదికగా జనవరి 11 నుంచి జరగనుంది.

19:15 January 06

మ్యాచ్​ ప్రారంభం..

భారత్​, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది.

సౌతాఫ్రికా బ్యాటింగ్​ నిలకడగా సాగుతోంది. మరో 100 పరుగులు చేస్తే వారిని విజయం వరిస్తుంది. భారత్​ 8 వికెట్లు పడగొడితే సిరీస్​ నెగ్గుతుంది.

దక్షిణాఫ్రికా ఓపెనర్​ డీన్​ ఎల్గర్​ అర్ధశతకం చేశాడు.

18:46 January 06

7.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం

వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్​ 7.15 గంటలకు ప్రారంభం కానుంది. ఈ రోజు 34 ఓవర్ల ఆట జరిగే అవకాశమున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వీలైతే మరో అరగంట పాటు ఆటను కొనసాగించనున్నారు.

15:42 January 06

నాలుగో రోజు ఆట జరిగేనా?

జోహన్నెస్​బర్గ్​ వేదికగా జరుగుతున్న భారత్​, దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్​ నాలుగో రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. వర్షం కొనసాగుతుండటం వల్ల కాస్త ఆలస్యంగా మ్యాచ్​ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వర్షం కారణంగా భోజన విరామం కూడా కాస్త ముందుగానే ప్రకటించారు.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. భారత్​పై విజయం సాధించడానికి ప్రోటీస్​ జట్టు ఇంకా 122 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్(46), వాండర్ డసెన్(11) ఉన్నారు.

Last Updated :Jan 6, 2022, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.