ETV Bharat / sports

అరంగేట్ర మ్యాచ్​లోనే ఏడు వికెట్లు.. ఈ ఆసీస్​ కుర్రోడు అదరగొట్టాడుగా!

author img

By

Published : Feb 11, 2023, 1:36 PM IST

Updated : Feb 11, 2023, 2:02 PM IST

ఓ వైపు మైదానంలో జడేజా, అశ్విన్​ తమ స్పిన్నులతో కంగారు టీమ్​ను హడలెత్తిస్తుండగా.. ఆసిస్​కు చెందిన ఓ ప్లేయర్​ మాత్రం మన టీమ్​ను ఓ ఆట ఆడుకున్నాడు. అతడే 22 ఏళ్ల టాడ్​ మర్ఫీ. బోర్డర్‌ -గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమ్​ ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఈ కంగారు జట్టు ప్లేయర్​ సంచలనం సృష్టించాడు. అలా అరంగేట్రంలోనే ఏడు వికెట్లు కూల్చి తన సత్తా చాటాడు.

todd murphy
todd murphy

ఆసిస్​కు చెందిన ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ టాడ్​ మర్ఫీ నాగ్​పుర్​ స్టేడియంలో జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన కనబరిచి అందరిని ఆకర్షించాడు. బోర్డర్‌ -గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమ్​ ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఈ కంగారు జట్టు ప్లేయర్​ సంచలనం సృష్టించాడు. అలా అరంగేట్రంలోనే ఏడు వికెట్లు కూల్చి తన సత్తా చాటాడు.

ఆ వికెట్​ వెరీ స్పెషల్​.. కేఎల్‌ రాహుల్‌ను అవుట్‌ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో తన తొలి వికెట్​ను నమోదు చేశాడు మర్ఫీ. అంతే కాకుండా రవిచంద్రన్‌ అశ్విన్‌, ఛతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా, శ్రీకర్‌ భరత్‌, మహ్మద్‌ షమీలను ఇదే తరహాలో వికెట్లు పడగొట్టి పెవిలియన్‌ బాట పట్టించాడు. అలా భారత తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా మొత్తంగా 124 పరుగులు ఇచ్చి.. 7 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ 22 ఏళ్ల స్పిన్నర్‌. ఆస్ట్రేలియా తరఫున డెబ్యూ టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ రికార్డలను నమోదు చేసిన మూడో బౌలర్‌గా టాడ్​ నిలిచాడు.

బాబ్‌ మాసీ, జేసన్‌ క్రెజా తర్వాతి స్థానాన్ని ఇతను సొంతం చేసుకోవడం విశేషం. ఇక తొలి మ్యాచ్​తోనే టీమ్​ ఇండియా లాంటి జట్టుపై అద్భుత ప్రదర్శన కనబరిచిన మర్ఫీ పై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇతని ఆటకు ఫిదా అయిన భారత మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ సహా పలువురు క్రీడా విశ్లేషకులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు. కాగా ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించిన టాడ్‌ మర్ఫీకి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. దాదాపు 11 నెలల క్రితం ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడిన మర్ఫీ.. ఈ మేరకు అరంగేట్రంలోనే పదునైన స్పిన్‌తో చెలరేగడం విశేషం. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన అతడు.. మరిన్ని అరుదైన ఘనతలు నమోదు చేసేందుకు సిద్ధమయ్యాడు.ఈ నేపథ్యంలో తన ప్రదర్శన పట్ల టాడ్‌ మర్ఫీ హర్షం ‍వ్యక్తం చేశాడు. గడిచిన రెండు రోజులు తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైనవంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇంతకంటే గొప్ప అరంగేట్రం ఏముంటుందంటున్నాడు ఈ రికార్డు ప్లేయర్​.

అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు(ఇప్పటి వరకు)

  • 8/84 బాబ్‌ మాసీ- 1972లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో- లార్డ్స్ టెస్టులో
  • 8/215- జాసన్‌ క్రెజా- 2008/09- టీమిండియాతో మ్యాచ్‌లో- నాగ్‌పూర్‌ టెస్టులో
  • 7/124- టాడ్‌ మర్ఫీ- 2022/23* టీమిండియాతో మ్యాచ్‌లో - నాగ్‌పూర్‌ టెస్టులో.
Last Updated : Feb 11, 2023, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.