ETV Bharat / sports

SL vs AFG World Cup 2023 : శ్రీలంకపై అఫ్గాన్ ఘన విజయం.. వరల్డ్​ కప్​లో ముచ్చటగా మూడో గెలుపు

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 9:55 PM IST

Updated : Oct 30, 2023, 10:32 PM IST

SL vs AFG World Cup 2023 : 2023 ప్రపంచ కప్​లో భాగంగా సోమవారం శ్రీలంకతో​ జరిగిన మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో అప్గానిస్థాన్ గెలిచింది. 2023 వరల్డ్​కప్​ టోర్నీలో మూడో విజయం నమోదు చేసి సంచలనం సృష్టించింది.

SL vs AFG World Cup 2023
SL vs AFG World Cup 2023

SL vs AFG World Cup 2023 : 2023 వరల్డ్​కప్​లో భాగంగా సోమవారం పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో శ్రీలంక​తో జరిగిన మ్యాచ్​లో అప్గానిస్థాన్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలకం​ 241 పరుగులు చేసింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అప్గాన్​ నిలకడగా ఆడుతూ 45.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్​ను ఛేదించింది. అప్గాన్ బ్యాటర్లు రహమత్ షా (62; 74 బంతుల్లో 7x4), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (58*; 74 బంతుల్లో 2x4, 1x6), అజ్మతుల్లా (73*; 63 బంతుల్లో 6x4, 3x6) హాఫ్​ సెంచరీలు పూర్తి చేశారు. ఓపెనర్​ ఇబ్రహీం జద్రన్ (39; 57 బంతుల్లో 4x4, 1x6) రాణించాడు. మరో ఓపెనర్​ రహ్మదుల్లా గుర్బాజ్(0) డకౌట్​ అయ్యాడు. ఇక శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మదుశంక రెండు వికెట్లు పడగొట్టగా.. కాసున్ రజితా ఒక వికెట్ తీశాడు.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ పాథుమ్ నిశాంక (46; 60 బంతుల్లో 5x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నె (15) పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపర్చాడు. కుశాల్ మెండిస్ (39; 50 బంతుల్లో 3x4), సదీర సమరవిక్రమార్క (36; 40 బంతుల్లో 3x4) ఫర్వాలేదనిపించారు. ఎంజొలో మాథ్యూస్‌ (23; 26 బంతుల్లో 1x4, 1x6), చరిత్ అసలంక (22), ధనంజయ డి సిల్వా (14) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. టెయిలెండర్ మహీశ్ తీక్షణ (29; 31 బంతుల్లో 3x4, 1x6) పోరాడాడు. అఫ్గానిస్థాన్‌ బౌలర్లలో ఫజల్ హక్‌ ఫారూఖీ 4, ముజిబుర్ రహ్మన్ 2, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రషీద్‌ఖాన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

వరల్డ్​ కప్​లో మరో సంచలనం..
అఫ్గాన్​ 2023 వరల్డ్​కప్​ కన్నా ముందు పలు ప్రపంచకప్​ టోర్నీల్లో పాల్గొంది. అందులో ఏ వరల్డ్​కప్​ టోర్నీలోనూ ఒక్క మ్యాచ్​ కూడా గెలవలేదు. కానీ 2023 వరల్డ్​ కప్​లో మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. ఈ ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​​పై గెలిచి చిరిత్ర సృష్టించిన అఫ్గాన్​.. ఆ తర్వాత పాకిస్థాన్​ను చిత్తు చేసి సంచలం సృష్టించింది. తాజా విక్టరీతో ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్​ల్లో మూడింటిని కైవసం చేసుకుంది. దీంతో 6 పాయింట్లతో సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

Hardik Pandya Injury : టీమ్​ఇండియాకు శుభవార్త.. జట్టులోకి హార్దిక్ పాండ్య ఎంట్రీ అప్పుడే!

Shami World Cup Wickets : సూపర్​ ఫామ్​లో షమీ.. అరుదైన రికార్డుకు అడుగు దూరంలో..

Last Updated : Oct 30, 2023, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.