ETV Bharat / sports

Ind Vs Pak World Cup 2023 : టీమ్​ఇండియా మైండ్​గేమ్​.. పాక్​ జట్టును ఉచ్చులోకి లాగిందిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 3:41 PM IST

Ind Vs Pak World Cup 2023 : అహ్మదాబాద్​ వేదికగా శనివారం జరిగిన భారత్- పాకిస్థాన్​ పోరులో విజయం టీమ్ఇండియాకే దక్కింది. అయితే ఈ గెలుపు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటంటే ?

Etv Bharat
Etv Bharat

Ind Vs Pak World Cup 2023 : ఇండియా- పాకిస్థాన్​ మ్యాచ్ అంటే క్రికెట్​ లవర్స్​కు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. నరాల తెగే ఉత్కంఠతో జరిగే ఈ పోరులో తమ జట్టు గెలవాలంటూ ఇండో - పాక్ ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అహ్మదబాద్​ వేదికగా జరిగిన తాజా మ్యాచ్​లోనూ ఇదే జరిగింది. లక్షల మంది వీక్షకుల నడుమ సాగిన ఆ హోరా హోరీ పోరులో తుది గెలుపు టీమ్ఇండియాకు దక్కింది. బుమ్రా, సిరాజ్​ లాంటి బౌలర్ల దెబ్బకు పాక్​ జట్టు విల విలలాడగా.. రోహిత్​, శ్రేయస్ పరుగుల వరదకు ఇక భారత జట్టుకు విజయం ఖారరైంది. పాక్​ బౌలర్లు ఎంతో శ్రమించినప్పటికీ మన ప్లేయర్లను చిత్తు చేయలేకపోయారు.

మ్యాచ్‌ ముందు నుంచే మైండ్‌గేమ్‌..
టాస్‌ నుంచే టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్‌ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ.. ప్రత్యర్థుల్లో సందేహాలు రేకెత్తించాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై టాస్‌ గెలిచినప్పటికీ.. బౌలింగ్‌నే ఎంపిక చేసుకున్నాడు. ఒకవేళ కొండంత లక్ష్యం ఎదురుగా పెట్టినా కూడా.. తమ బ్యాటింగ్‌ లైనప్‌ దాన్ని పిండిచేస్తుందనే ధైర్యంతో ముందుకు సాగాడు. అంతేకాదు.. తమ బౌలర్లు పాక్‌ను తక్కువకే కట్టడి చేస్తారన్న విశ్వాసాన్ని కూడా కనబర్చాడు. ఇన్నింగ్స్‌ మొదలై పాక్‌ బ్యాటర్లు రెండు ఓవర్ల పాటు సిరాజ్‌పై ఎదురు దాడి చేసినా కూడా.. పవర్‌ ప్లేలో అతడి రికార్డును దృష్టిలోపెట్టుకొని అతడితోనే బౌలింగ్‌ను కొనసాగించాడు. ఇక సిరాజ్​ కూడా కూడా కెప్టెన్‌ నమ్మకాన్ని వమ్ముచేయకుండా షఫీక్‌ రూపంలో తొలి వికెట్‌ను అందించాడు.

అయితే వైట్‌ బాల్‌ క్రికెట్‌లో ప్రత్యర్థి రన్‌రేట్‌ను కట్టడి చేయడం అనేది చాలా ముఖ్యం. వికెట్లు రావడం అనేది బోనస్​​ లాంటిది. భారత్‌ దీన్ని మైండ్​లో పెట్టుకుంది. అలా ఓపెనర్‌ ఇమామ్‌ వికెట్‌ పడ్డాక.. బాబర్‌-రిజ్వాన్‌ల పని పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ టోర్నిలో సూపర్‌ఫామ్‌లో ఉన్న రిజ్వాన్​ను రోహిత్‌ తెలివిగా దెబ్బతీశాడు. పాండ్యా, జడేజా, కుల్దీప్‌లను మార్చిమార్చి బౌలింగ్‌ చేయించి భయపెట్టాడు. ఫలితంగా పవర్‌ ప్లే తర్వాత పాక్‌ జట్టు ఒక ఓవర్‌లో పది పరుగులు సాధించిన సందర్భాలు కేవలం మూడే ఉన్నాయి.

ఇక 20వ ఓవర్‌ వచ్చేసరికి పాక్‌ బ్యాటర్లపై బాగా ఒత్తిడి పెరిగింది. దీంతో రన్‌రేట్‌ అమాంతం పడిపోయింది. దీంతో 20-42వ ఓవర్‌ మధ్యలో పాక్ ప్లేయర్లు కేవలం 8 సార్లు మాత్రమే ఓవరకు ఐదు అంత కంటే ఎక్కువ పరుగులు చేశారు. జడేజా, కుల్దీప్ వేసిన 23-28 ఓవర్ల మధ్య ఏ ఓవర్‌లోనూ పాక్​ 5 పరుగులు చేయలేదు. అయితే తొలి స్పెల్‌లో ధారాళంగా పరుగులిచ్చిన సిరాజ్​ను టార్గెట్​ చేశారు పాక్‌ బ్యాటర్లు. అయితే బాబర్ వికెట్‌ను తీసిన సిరాజ్​ వారి అంచానలను తారుమారు చేశాడు. వికెట్లు రాకపోతే.. పరుగులు కట్టడి చేస్తే ఫలితం లభిస్తుందనే సూత్రాన్ని భారత్‌ అద్భుతంగా అమలు చేసింది. అలా బౌలర్లు కట్టుదిట్టంగా ఆడి జట్టును విజయ పథంలో నడిపించారు.

చిన్న లక్ష్యమే కానీ..
India Vs Pakistan World Cup : 50 ఓవర్లకు 192 అనేది చాలా చిన్న లక్ష్యం. కానీ, అక్కడ ఉన్నది పాక్‌ సీమర్లు. షహీన్‌, హారిస్‌లతో కూడిన అత్యంత ప్రమాదకరమైన పేస్‌ దళం అది. అయితే తొలి బంతి నుంచే పాక్‌ బౌలర్లపై రోహిత్‌ ఎదురుదాడి మొదలుపెట్టాడు. షహీన్‌, హారిస్‌లను లక్ష్యాంగా చేసుకున్న హిట్​ మ్యాన్​ బాల్​ను బౌండరీని దాటించాడు. ఇలా రోహిత్​ చేయడం వెనుక ఓ కారణం ఉంది. ప్రస్తుతం ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లు మెరుగైన రన్‌రేట్‌తో ఉన్నాయి. ఏదైనా జరిగి పాయింట్లు సమమైతే.. నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఈ అంశాన్ని కూడా కెప్టెన్‌ మనసులో పెట్టుకొన్నాడు. గిల్‌, కోహ్లీ వికెట్లు పడినా సరే.. ఎక్కడా కూడా తన పరుగుల వేగానికి బ్రేకులు వేయలేదు. నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లో కూడ రోహిత్‌ ఇదే శైలిలో ఆడాడు. ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌నూ భారత్‌ సీరియస్‌గా తీసుకుంటుంది అనడానికి ఇదే ఉదాహరణ.

ఇక టీమ్ఇండియా మిడిలార్డర్‌ కూడా తొలి మ్యాచ్‌ నుంచి ఎంతో జాగ్రత్తగా ఆడుతోంది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో.. జట్టును గట్టెక్కించింది. తాజాగా గిల్‌, విరాట్‌ వంటి టాప్‌ ఆర్డర్ ఆటగాళ్లు వేగంగా ఆడే క్రమంలో ఔటైనా సరే.. రాహుల్‌, అయ్యర్‌ ఎటువంటి లోపాలకు చోటివ్వకుండా జట్టును గెలిపించారు. ఛేజింగ్‌ చేయడం సహజంగానే బ్యాటర్లపై తెలియని ఒత్తిడిని పెంచుతుంది.. కానీ, ఈ టోర్నీలో ఆసీస్‌, పాక్‌ వంటి బలమైన జట్లను ఛేజింగ్‌లోనే ఓడించడం టీమ్​ఇండియా కాన్ఫిడెన్స్​ను తెలియజేస్తోంది.

ODI World Cup 2023 Ind Vs Pak : పాక్​పై భారత్​ విజయం.. కెప్టెన్స్​ రోహిత్​ - బాబర్​ ఏం అన్నారంటే?

India vs Pakistan Match Viewership : హాట్​స్టార్​లోనూ రికార్డు కొట్టిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్​.. ఏకంకా 3.5 కోట్ల వ్యూస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.