ETV Bharat / sports

'భారత్​-పాక్​ మ్యాచ్​లో క్రికెట్​ మాత్రమే గెలిచింది'

author img

By

Published : Aug 30, 2022, 9:29 PM IST

Asia Cup 2022
I can only say Cricket won: Kapil Dev on India-Pak encounter in Asia Cup 2022

ఆసియా కప్​లో భారత్​- పాకిస్థాన్​​ మ్యాచ్​పై దిగ్గజ క్రికెటర్​ కపిల్ దేవ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్​లో ఎవ్వరూ గెలవలేదని, క్రికెట్​ మాత్రమే గెలిచిందని అన్నారు.

Asia Cup 2022 : దిగ్గజ క్రికెటర్, టీమ్​ ఇండియా మాజీ సారథి కపిల్​ దేవ్.. ఆసియా కప్​లో భారత్​-పాకిస్థాన్​ మ్యాచ్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్​ జరిగిన స్ఫూర్తిని ప్రశంసించారు. ఇందులో క్రికెట్​ గెలిచిందని అన్నారు.
"భారత్​-పాక్​ కాదు, క్రికెట్​ మాత్రమే గెలిచిందని నేను చెప్పగలను. మ్యాచ్​ అద్భుతంగా జరిగింది. ఇరు జట్లు చాలా బాగా ఆడాయి. అయితే, గెలిచిన జట్టు కొంచెం ఎంజాయ్​ చేస్తుంది. ఓడిపోయిన జట్టు మరోసారి ప్రయత్నిస్తాం అని చెబుతుంది. ఆట అంటే అదే.'' అని కపిల్​ దేవ్​ అన్నారు.

అయితే, ఆగస్టు 28న దుబాయ్​ అంతర్జాతీయ క్రికెట్​ స్టేడియంలో ఆసియా కప్​లో భారత్​-పాక్​ మ్యాచ్​ జరిగింది. రవీంద్ర జడేజా, హార్దిక్​ పాండ్య అద్భుత భాగస్వామ్యంతో టీమ్​ఇండియా మ్యాచ్​ గెలిచింది. 5 వికెట్ల తేడాతో పాక్​ను ఓడించింది.
మ్యాచ్​ మొత్తం ఉత్కంఠగా సాగింది. ఆఖరి ఓవర్​లో హార్దిక్ పాండ్య నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్​ను సిక్స్​తో ముగించాడు. పాండ్య బౌలింగ్​లోనూ రాణించాడు. 3 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్​.. పాకిస్థాన్​ను 147కే ఆలౌట్​ చేసింది. ఆల్​రౌండ్​ ప్రదర్శన చేసిన హార్దిక్​కు 'మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్​' దక్కింది. ఆగస్టు 31న భారత్​, హాంకాంగ్​తో తలపడనుంది.

ఇవీ చదవండి: హార్దిక్​, జడేజా ఉంటే అలా చేయడం అంత కష్టమా

టీ20ల్లో పంత్​ కార్తీక్​, బెస్ట్​ ప్లేయర్​ ఎవరంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.