ETV Bharat / sports

మహిళల ఐపీఎల్​పై గంగూలీ క్లారిటీ.. 'అప్పుడైతేనే కరెక్ట్​'

author img

By

Published : Feb 4, 2022, 5:11 PM IST

Ganguly BCCI President: పురుషుల ఐపీఎల్​కు దీటుగా మహిళల ఐపీఎల్​ నిర్వహిస్తామని అన్నారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో మహిళల ఐపీఎల్​ నిర్వహించడానికి సరైన సమయం అని అభిప్రాయపడ్డారు.

Ganguly BCCI President
గంగూలీ

Ganguly BCCI President: మహిళల ఐపీఎల్​పై బీసీసీఐ అధ్యక్షుడు​ గంగూలీ కీలక ప్రకటన చేశారు. పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్​ను నిర్వహించడానికి వచ్చే ఏడాది సరైన సమయమని చెప్పుకొచ్చారు. పురుషుల ఐపీఎల్​కు దీటుగా ఈ టోర్నీని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టి 26 నెలలు పూర్తయిన నేపథ్యంలో పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఏటా 'ఉమన్స్​ టీ20 ఛాలెంజ్​' పేరుతో మూడు జట్లతో మినీ టోర్నీను బీసీసీఐ నిర్వహిస్తోంది. అయితే గతేడాది రెండు విడతల్లో పురుషుల ఐపీఎల్​ నిర్వహించిన కారణంగా ఈ టోర్నీ జరగలేదు.

నాకు ఆ అవసరం లేదు

ఆటగాళ్ల ఎంపికపై సెలక్షన్​ కమిటీని తాను ప్రభావితం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఖండించారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. ఇటువంటి నిరాధార ఆరోపణలపై తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బోర్డు అధ్యక్షుడి కన్నా ముందు తాను కూడా ఓ ఆటగాడిని అనే విషయంపై విమర్శకులు మర్చిపోవద్దని చెప్పారు.

"నేను సెలక్షన్​ కమిటీ మీటింగ్​లో ఉన్నట్లు ఓ ఫొటో సోషల్​ మీడియాలో వైరలైంది. దానిపై నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. అది సెలక్షన్​ కమిటీ మీటింగ్​కు చెందినది కాదు. ఆ చిత్రంలో ఉన్న జాయింట్​ సెక్రటరీ జయేష్​ జార్జి అసలు కమిటీ మీటింగ్స్​లో పాల్గొనరు."

-సౌరవ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

టెస్టు కెప్టెన్​పై..

విరాట్​ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న నేపథ్యంలో తదుపరి కెప్టెన్​ ఎవరనే విషయంపై గంగూలీ క్లారిటీ ఇచ్చారు. ఆ విషయంపై సెలక్టర్లతో చర్చిస్తున్నామని అని పేర్కొన్నారు. కెప్టెన్సీ ప్రమాణాలకు తగిన ఆటగాడిని వారు ఎంపిక చేసి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

పుజారా, రహానె భవితవ్యంపై స్పందిస్తూ రంజీలో వారి ప్రదర్శన ఆధారంగా సెలక్టర్లు శ్రీలంకతో సిరీస్​కు ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

ఇదీ చూడండి : 'బుమ్రాను చూసి ఆశ్చర్యపోయిన కోహ్లీ.. వెంటనే టెస్టుల్లో ఛాన్స్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.