ETV Bharat / sports

వివాదాస్పద పాక్​ 'అంపైర్​'.. ఇప్పుడు బట్టలు, చెప్పులు అమ్ముకుంటూ!

author img

By

Published : Jun 24, 2022, 6:07 PM IST

Updated : Jun 24, 2022, 6:27 PM IST

Asad Rauf Selling Clothes: అతడో మాజీ అంపైర్​. 170 అంతర్జాతీయ మ్యాచ్​లకు బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత క్రికెట్​ను వదిలేసిన అతడు​.. ఇప్పుడు పాకిస్థాన్​ లాహోర్​లోని ప్రముఖ లాండా బజార్​లో దుస్తులు, చెప్పులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అసలేమైంది..?

Former ICC elite panel umpire Asad Rauf now runs a shop
Former ICC elite panel umpire Asad Rauf now runs a shop

Asad Rauf Selling Clothes: 1996 క్రికెట్​ వన్డే వరల్డ్​కప్​ విన్నింగ్​ టీంలో భాగమైన శ్రీలంక క్రికెటర్ రోషన్​ మహానమా.. ఇటీవల సంక్షోభం నేపథ్యంలో టీ, బన్​ అమ్ముకుంటూ కనిపించిన సంగతి తెలిసిందే. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్​ కూడా అయ్యాయి. ఇప్పుడు ఓ పాక్​ మాజీ అంపైర్​, ఐసీసీ ఎలైట్​ ప్యానెల్​లోనూ చోటు దక్కించుకున్న అసద్​ రవూఫ్​​.. పాకిస్థాన్​ లాహోర్​లోని లాండా బజార్​లో బట్టల షాప్​ నడుపుతున్నాడు. దుస్తులు, పాదరక్షలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

2000-13 మధ్యలో మొత్తం 170 అంతర్జాతీయ మ్యాచ్​లకు అంపైర్​గా వ్యవహరించాడు అసద్​. ఆ తర్వాత నిషేధానికి గురైన అతడు.. క్రికెట్​ను వదిలేశాడు. ఇప్పుడు నడిపే స్టోర్​ తన కోసం కాదని, తన సిబ్బంది రోజువారీ ఖర్చుల కోసమని చెప్పడం విశేషం.

''నేను చాలా మ్యాచ్​లకు అంపైర్​గా పనిచేశాను. నేను చూడటానికి ఇంకేం లేదు. 2013 తర్వాత.. నేనసలు క్రికెట్​ను అనుసరించట్లేదు. నేను ఒకటి వదిలేస్తే.. అది జీవితాంతం విడిచిపెట్టినట్లే.''

- అసద్​ రవూఫ్​, మాజీ అంపైర్​

2013 ఐపీఎల్​లో బుకీల నుంచి గిఫ్ట్​లు స్వీకరించారని, స్పాట్​​ ఫిక్సింగ్​ కుంభకోణంలో ప్రమేయం ఉందని రవూఫ్​పై ఆరోపణలు వచ్చాయి. అవినీతికి పాల్పడి, ఆటకు అంతరాయం కలిగించిన కారణంగా.. రవూఫ్​పై 2016లో బీసీసీఐ నిషేధం విధించింది. 2012లో రవూఫ్​ పెళ్లిచేసుకుంటానని మోసం చేసినట్లు ఆరోపణలు చేసింది ముంబయికి చెందిన ఓ మోడల్​. తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన రవూఫ్​.. ఇది జరిగిన మరుసటి ఏడాది ఐపీఎల్​లో అంపైరింగ్​ చేసినట్లు చెప్పడం కొసమెరుపు.

ఇవీ చూడండి: ఐపీఎల్​ మీడియా హక్కుల వేలంపై పాక్‌ క్రికెటర్ల అక్కసు

క్రికెట్​కు పనికిరాడన్నవాడే కెప్టెన్​ అయ్యాడు.. ఎలా సాధ్యమైంది?

Last Updated : Jun 24, 2022, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.