ETV Bharat / sports

అది ధోనీ క్రేజ్​ అంటే.. ఆ ప్రాక్టీస్ మ్యాచ్​ కోసం 20వేల మంది

author img

By

Published : Jan 2, 2023, 8:12 PM IST

ధోనీ విషయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నాడు సీఎస్కే కోచ్​ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌. అది తనకెంతో ప్రత్యేక సందర్భమంటూ హర్షం వ్యక్తం చేశాడు.

Dhoni craze IPL
అది ధోనీ క్రేజ్​ అంటే.. ఆ ప్రాక్టీస్ మ్యాచ్​ కోసం 20వేల మంది

మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్​ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. ఇక ఐపీఎల్​లోనూ సీఎస్కేకు అంత క్రేజ్​ వచ్చిందంటే అది మహీ వల్లనే! అయితే ఈ మెగాటోర్నీకి మహీ రిటైర్మెంట్‌ను ప్రకటిస్తాడని క్రికెట్‌ వర్గాల్లో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. రానున్న సీజన్‌ ఈ కెప్టెన్‌ కూల్‌కు చివరిదిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహీ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌. సీఎస్కే హోంటౌన్ చెన్నైలోని​ చెపాక్​ స్టేడియంలో.. మహీ విషయంలో జరిగిన ఓ సంఘటనను చూసి తాను ఆశ్చర్యానికి గురైనట్లు గుర్తుచేసుకున్నాడు. అది తనకెంతో ప్రత్యేక సందర్భమంటూ హర్షం వ్యక్తం చేశాడు. దాదాపు రెండు సీజన్ల తర్వాత వచ్చే ఐపీఎల్​లో సీఎస్కే తమ హోంటౌన్​లో ఆడనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

"చెపాక్‌ స్టేడియం దాదాపు 20 వేల మందితో నిండి ఉంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కోసం ధోనీ స్టేడియంలోకి అడుగుపెట్టగానే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా హోరెత్తింది. ఒక ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు ఈ విధంగా భారీ స్థాయిలో జనం తరలిరావడం.. ఉత్సాహంగా నినాదాలు చేయడం నేను ముందెప్పుడూ చూడలేదు. ముఖ్యంగా ధోనీ బ్యాటింగ్‌కు వచ్చిన ఆ క్షణం నా ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నాతో పాటు చాలా మంది ఆటగాళ్లు, ప్రేక్షకులు కూడా దానిని అనుభూతి చెంది ఉంటారు. ఇది చాలా ప్రత్యేకమైనది" అంటూ కోచ్‌ తెలిపాడు. ఇక ఇప్పటికే నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫిని ముద్దాడిన చెన్నై జట్టు.. మరోసారి విజయాన్ని సొంతం చేసుకునేందుకు పట్టుదలతో ఉంది.

ఇదీ చూడండి: మిషన్ 2024 టార్గెట్​​.. లంకతో భారత్​ ఢీ.. పాండ్య సేన బోణీ కొడుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.