ETV Bharat / sports

'నేను చూసిన బెస్ట్​ కెప్టెన్​ ధోనీ'

author img

By

Published : Aug 17, 2020, 2:10 PM IST

స్టార్ క్రికెటర్ ధోనీ.. తాను చూసిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడని టీమ్​ఇండియా మాజీ కోచ్​ గ్యారీ కిర్​స్టన్​ అన్నాడు. మాహీ లాంటి సారథితో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు.

Kirsten on Dhoni
ధోనీ

తన కెరీర్​లో చూసిన ఉత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్​ ధోనీ ఒకడని టీమ్​ఇండియా మాజీ కోచ్​ గ్యారీ కిర్​స్టన్​ అన్నాడు. ధోనీ రిటైర్మెంట్​పై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటివరకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన మహీకీ కృతజ్ఞతలు చెప్పారు.

Kirsten on Dhoni
గ్యారీ కిర్​స్టన్​

"నేను చూసిన ఉత్తమ సారథుల్లో ధోనీ ఒకడు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం నిజంగా గర్వకారణం. భారత జట్టుతో చాలా మంచి జ్ఞాపకాలను అందించినందుకు ధోనీకి ధన్యవాదాలు"

గ్యారీ కిర్​స్టన్​, టీమ్​ఇండియా మాజీ కోచ్​

2008 నుంచి 2011 వరకు భారత జట్టుకు ప్రధాన కోచ్​గా వ్యవహరించారు గ్యారీ. వీరిద్దరి కాంబోలోనే 2011 వన్డే ప్రపంచకప్​ సాధించింది భారత్.​ అంతకు ముందు గ్యారీ శిక్షణలోనే 2010 ఆసియాకప్​ను సొంతం చేసుకుంది. అప్పుడే ధోనీతో కిర్​స్టన్​కు మంచి అనుబంధం ఏర్పడింది.

ధోనీ వీడ్కోలు సందర్భంగా అనేక మంది మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు సోషల్​ మీడియా వేదికగా స్పందించారు. కెప్టెన్​గా మహీ నడుచుకునే తీరు, బ్యాటింగ్​, వికెట్​ కీపర్​గా అద్భుతమైన నైపుణ్యాలున్న ఆటగాడని ప్రశంసించారు. ఎంతో మంది యువ క్రికెటర్లకు అతడు ఆదర్శమని అన్నారు. టీమ్​ఇండియాలో ఓ శకం ముగిసిందని పేర్కొన్నారు.

ఐపీఎల్​లో ధోనీ

యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్​లో బరిలోకి దిగనున్నడు ధోనీ. ఇప్పటికే చెన్నై చేరుకున్న మహీ.. శిక్షణలో పాల్గొంటున్నాడు. ఆగస్టు 20 తర్వాత ప్రత్యేక విమానంలో, జట్టులోని మిగతా సభ్యులతో కలిసి దుబాయ్​ వెళ్లనున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.