ETV Bharat / sports

కామన్వెల్త్‌ గేమ్స్‌లో టీమ్​ఇండియా జట్టు ఇదే.. ఆంధ్రా అమ్మాయికి ఛాన్స్​

author img

By

Published : Jul 12, 2022, 10:56 AM IST

Common wealth games Teamindia: బర్మింగ్​హమ్​ వేదికగా జరగబోయే కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్‌ జట్టును ప్రకటించారు. ఈ టీమ్​కు హర్మన్​ప్రీత్​ కౌర్​ కెప్టెన్​గా వ్యవహరించగా.. స్మృతి మంధాన వైస్​కెప్టెన్​గా ఎంపికైంది. అలాగే ఆంధ్రప్రదేశ్​ నుంచి సబ్బినేని మేఘనకు జట్టులో చోటు దక్కింది.

Common wealth games Women Teamindia T20 team
కామన్వెల్త్‌ గేమ్స్‌లో టీమ్​ఇండియా జట్టు ఇదే

Common wealth games Teamindia: కామన్వెల్త్​​ క్రీడల్లో క్రికెట్​కు చోటు కల్పించేందుకు చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1998లో కౌలలాంపుర్​లో జరిగిన కామన్వెల్త్​ క్రీడల్లో మెన్స్​ వన్డే క్రికెట్​ను నిర్వహించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు బర్మింగ్​హమ్​ వేదికగా జరగనున్న 2022 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్​కు అవకాశమిచ్చారు. తాజాగా జట్టును ప్రకటించారు. టీ20 ఫార్మాట్​లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది ప్లేయర్స్ పేర్లను ప్రకటించారు. హర్మన్​ప్రీత్​ కౌర్​ కెప్టెన్​గా, స్మృతి మంధాన వైస్​కెప్టెన్​గా వ్యవహరించనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్​ నుంచి సబ్బినేని మేఘనకు జట్టులో చోటు లభించింది. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, బార్బడోస్, పాకిస్థాన్ ఉండగా.. గ్రూప్​-బీలో శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా గ్రూప్-బీలో ఉన్నాయి. ఈ నెల 29న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు చేరతాయి.

భారత టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా, యస్తిక , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, రేణుక సింగ్, జెమీమా, రాధా యాదవ్, హర్లీన్, స్నేహ్‌ రాణా.

కాగా, భారత్ ఇటీవలే శ్రీలంకతో జరిగిన సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుని ఆత్మవిశ్వాసంతో కామన్వెల్త్‌లో బరిలోకి దిగుతోంది. ఈ విషయంపై ఉమెన్ క్రికెట్ జట్టు కోచ్ రమేశ్ పొవార్ మాట్లాడుతూ.. "శ్రీలంకతో సిరీస్‌ నుంచే కామన్వెల్త్ గేమ్స్‌కు సన్నాహాలు ప్రారంభించాం. వికెట్స్ నెమ్మదిగా ఉంది. కాబట్టి బౌలింగ్‌కు అనుకూలించే అవకాశముంది. నాకు తెలిసి పెద్ద స్కోర్లు ఇక్కడ నమోదు కావు. అయితే హర్మన్ ప్రీత్, షెఫాలీ వర్మ, జెమియా రోడ్రిగ్స్, స్మృతి మంధానా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు" అని అన్నాడు. కాగా, బర్మింగ్​హమ్​ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు భారత్ నుంచి 215 మంది ఆటగాళ్లు హాజరవుతున్నారు. ఈ పోటీలకు 108 మంది పురుషులు, 107 మంది మహిళలతో పాటు 72 మంది టీమ్ ప్రతినిధులు, 26 మంది అదనపు సిబ్బంది, ముగ్గురు జనరల్ మేనెజర్లు, 9 మంది అత్యవసర సిబ్బందితో కలిపి 322 మంది వెళ్తున్నారు.

ఇదీ చూడండి: 'కోహ్లీ జట్టుకు భారంగా మారాడు.. పేరును చూసి టీమ్​లోకి తీసుకోవద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.