ETV Bharat / sports

టీమ్ఇండియాకు దూరం - రంజీలో టాప్​ -  శతకంతో సెలక్టర్లకు కౌంటర్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 9:41 AM IST

Cheteshwar Pujara Ranji Trophy : తన పేలవ ఫామ్​ కారణంగా టీమ్ఇండియాకు దూరమైన స్టార్​ క్రికెటర్​ ఛతేశ్వర్​ పుజారా తాజాగా జరిగిన రంజీ ట్రోఫీలో శతక్కొట్టాడు.

Cheteshwar Pujara  Ranji Trophy
Cheteshwar Pujara Ranji Trophy

Cheteshwar Pujara Ranji Trophy : టీమ్​ఇండియాకు దురమైన స్టార్ బ్యాటర్​ ఛతేశ్వర్‌ పుజారా తాజాగా రంజీ ట్రోఫీలో చెలరేగిపోయాడు. శనివారం ఝార్ఖండ్ - సౌరాష్ట్రకు మధ్య జరిగిన మ్యాచ్​లో శతక్కొట్టాడు. గ్రూప్‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌లో (157*‌‌‌) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్‌‌‌‌ సౌరాష్ట్ర 264 పరుగులు సాధించింది.

మరోవైపు ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 108/1తో రెండో రోజు (శనివారం) మ్యాచ్​ను కొనసాగించిన సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 406/2 స్కోరు చేసింది. ఇక సౌరాష్ట్ర జట్టులో హార్విక్ దేశాయ్ (85), అర్పిత్‌‌‌‌ వసవాడ (68), షెల్డన్ జాక్సన్‌‌‌‌ (54) రాణించారు. ఇక పుజారాకు తోడు ప్రస్తుతం క్రీజులో ప్రేరక్‌‌‌‌ మన్కడ్‌‌‌‌ (23*) ఉన్నాడు.

ఇక పుజారాను భారత టెస్టు జట్టు నుంచి తప్పించి ఇప్పటికే చాలా నెలలు గడిచిపోయాయి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చివరిసారిగా టీమ్​ఇండియా తరఫున ఆడిన ఈ స్టార్ ప్లేయర్ ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​లో రాణించలేకపోయాడు. దీంతో వెస్టిండీస్‌ పర్యటనలో మేనేజ్​మెంట్​ అతడ్ని పక్కనబెట్టింది. అయితే దేశవాళీ క్రికెట్‌లో సొంత జట్టు సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంగ్లాండ్​ కౌంటీల్లోనూ సెంచరీలు కొడుతూ తన ఫామ్‌ను నిరూపించుకుంటూనే ఉన్నాడు.

ఇప్పుడు భారత్ తదుపరి టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉండగా మరికొద్ది రోజుల్లో ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ సెంచరీ చూసైనా పుజారాను జట్టులో తీసుకుంటే బాగున్ను అంటూ ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు.

అయితే పుజారా తన టెస్టు కెరీర్​లో ఇప్పటివరకు 103 మ్యాచ్​లు ఆడాడు. అందులోని 176 ఇన్నింగ్స్ ల్లో 44.37 సగటుతో 7195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా గత మూడేళ్లలో పుజారా ఆడిన 48 ఇన్నింగ్స్​ల్లో కేవలం ఒకే శతకం సాధించాడు. ఇందులో ఏకంకా ఐదుసార్లు డకౌట్​గా వెనుదిరిగాడు.

దుమ్మురేపిన పుజారా.. దులీప్​ ట్రోఫీలో 'సూపర్'​ సెంచరీ..

Pujara Suspension : వాళ్లు చేసిన పనికి పుజారాపై వేటు.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.