ETV Bharat / sports

పుజారా సెన్సేషనల్​ రికార్డు.. సచిన్​, కోహ్లీ తర్వాత..

author img

By

Published : Dec 23, 2022, 12:10 PM IST

బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్​లో టీమ్ ఇండియా ప్లేయర్​ పుజారా మరో అరుదైన రికార్డు సాధించాడు. దీంతో సచిన్​, కొహ్లీ తర్వాత ఆ రికార్డు తన సొంతమయ్యింది.

Cheteshwar Pujara
Cheteshwar Pujara

India Vs Bangladesh: బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో లంచ్ బ్రేక్ సమయానికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్​లో పుజారా మరో అరుదైన రికార్డును సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌ తరఫున ఈ ఘనతను సాధించిన ఎనిమిదో క్రికెటర్​గా రికార్డుకెక్కాడు. అలా సునిల్‌ గవాస్కర్‌, సచిన్‌ తెందుల్కర్‌ వంటి దిగ్గజ ప్లేయర్ల పక్కన చోటు సంపాదించాడు.

షకీబ్‌ అల్‌ హసన్‌ వేసిన బంతి(18.5 ఓవర్‌)కి మూడు పరుగులు తీసి పుజారా 7 వేల పరుగుల మార్కును అందుకున్నాడు. అయితే, మొదటి టెస్టులో సెంచరీ కొట్టిన పుజారా..రెండో మ్యాచ్‌లో 24 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ ముగించాడు. సౌతాఫ్రికా టూర్‌ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌.. కౌంటీల్లో ససెక్స్‌ తరఫున మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్​ పర్యటనలో ఆఖరి టెస్టులో జట్టులోకి తిరిగి వచ్చాడు.

ఇప్పటి వరకు ఈ రికార్డు కొల్లగొట్టిన స్టార్స్​ వీరే..

  • సచిన్‌ టెండుల్కర్‌- 15,921
  • రాహుల్‌ ద్రవిడ్‌- 13265
  • సునిల్‌ గావస్కర్‌- 10122
  • వీవీఎస్‌ లక్ష్మణ్‌- 8781
  • వీరేంద్ర సెహ్వాగ్‌- 8503
  • విరాట్‌ కోహ్లి- 8099*
  • సౌరవ్‌ గంగూలీ- 7212
  • ఛతేశ్వర్‌ పుజారా- 7000*

ఇదీ చదవండి:

'మార్టినెజ్‌.. ఇదేం పని?'.. ఎంబాపె ముఖం ఫొటో తగిలించిన పిల్లాడి బొమ్మను..

టీమ్​ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్​కు అప్పగిస్తున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.