ETV Bharat / sports

ఆర్సీబీ మోసం చేసింది.. చాలా కోపం వచ్చింది! : చాహల్

author img

By

Published : Jul 16, 2023, 11:19 AM IST

Updated : Jul 16, 2023, 11:38 AM IST

Chahal rcb retention : ఆర్సీబీపై ఆ జట్టు మాజీ ప్లేయర్​ చాహల్​ అసహనం వ్యక్తం చేశాడు. అలాగా చాలా బాధపడ్డాడు కూడా. ఆ వివరాలు..

Chahal rcb retention :
ఆర్సీబీ మోసం చేసింది.. చాలా కోపం వచ్చింది! : చాహల్

Chahal rcb retention : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021(ఐపీఎల్) సీజన్‌ తర్వాత యుజ్వేంద్ర చాహల్‌ను పక్కనపెట్టింది రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు. తమ జట్టుతో అట్టిపెట్టుకోలేదు. అప్పుడు బెంగళూరు జట్టుపై విమర్శలు కూడా వచ్చాయి. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఆడిన చాహల్​ను తీసుకోకపోవడం ఏంటి ప్రశ్నించారు. రిటెయిన్‌ చేసుకోకపోవడమే కాకుండా.. తనను పక్కన పెట్టడానికి గల కారణమేంటో కూడా చాహల్‌కు చెప్పలేదు. దీంతో ఆర్సీబీ విమర్శలు మరింత ఎక్కువగా వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై చాహల్‌ మాట్లాడాడు.

"2014లో ఆర్సీబీ టీమ్​తో నా జర్నీ ప్రారంభమైంది. ఫస్ట్​ మ్యాచ్‌ నుంచి కోహ్లీ నా మీద నమ్మకం ఉంచాడు. నన్ను రిటెయిన్‌ చేసుకోకపోవడంతో చాలా బాధపడ్డాను. ఎనిమిదేళ్ల పాటు ఆ జట్టు కోసం ఆడాను. కానీ కనీసం కారణం కూడా చెప్పలేదు. అది తీవ్ర ఆవేదనకు గురి చేసింది. కొంతమంది నేను ఎక్కువగా డబ్బు డిమాండ్​ చేసినట్లు మాట్లాడుకున్నారు. అవి విన్నప్పుడు మరింత బాధేసింది. పలు ఇంటర్వ్యూల్లో దీనిపై క్లారిటీ కూడా ఇచ్చాను. నేను ఎలాంటి ప్రయోజనాలను ఆశించలేదు. నేనెంత పొందడానికి అర్హుడినో నాకు తెలుసు. కానీ అలాంటి వార్తలు వచ్చినప్పుడు కూడా బెంగళూరు జట్టు స్పందించలేదు. కనీసం ఒక్క ఫోన్‌ కాల్‌ చేసి కూడా మాట్లాడలేదు. ఇది మరింత బాధనిచ్చింది. ఇప్పటికీ నన్ను ఎందుకు పక్కనపెట్టిందో కూడా చెప్పలేదు" అని అన్నాడు.

"ఆర్సీబీ ఫ్రాంచైజీ తరఫున 140 మ్యాచులు వరకు ఆడాను. అయితే.. సరైన కారణం చెప్పకుండా, సమాచారం ఇవ్వకుండానే నన్ను పక్కన పెట్టేశారు. రిటెయిన్‌ చేసుకోలేదు. కానీ వేలంలో మాత్రం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే వేలంలో ఒక్క బిడ్‌ కూడా వేయలేదు. దీంతో ఆ జట్టుపై విపరీతమైన కోపం వచ్చింది. ఎనిమిదేళ్లు ఆడినా కూడా కనీసం పట్టించుకోలేదు. నాకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అంటే ఎంతో ఇష్టం. జరిగిందేదో జరిగింది. అదంతా మన మంచికే అని భావిస్తున్నాను. రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్​లోకి వచ్చిన తర్వాత.. ఇప్పుడు డెత్‌బౌలర్‌గా మారాను. చివరి ఓవర్లలో బౌలింగ్‌ చేస్తున్నాను గతంలో బెంగళూరు జట్టులో ఉన్నప్పుడు చివరిగా 16 లేదా 17వ ఓవర్‌ బౌలింగ్ చేసేవాడిని. అప్పటికి, ఇప్పటికీ నా ఆట ఇంకాస్త పెరిగింది. దాదాపు 5 నుంచి 10 శాతం పెరిగిందనే చెప్పాలి. అందుకే అప్పుడు జరిగిందంతా నా మంచికే అని భావిస్తున్నాను." అని చాహల్‌ పేర్కొన్నాడు.

కాగా, ఐపీఎల్ 2021 సీజన్‌ ముగిసిన తర్వాత జరిగిన ఆక్షన్​లో చాహల్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. ఈ వేలంలో దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య గట్టి పోటీ కూడా జరిగింది. చివరికి సంజూ శాంసన్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ జట్టు.. చాహల్‌ను రూ. 6.50 కోట్లకు సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి :

హాలీడే ట్రిప్​లో చాహల్ భార్య ​.. అదిరిపోయే పోజుల్లో ఫొటోలు..

ఒక్క రీల్​తో విడాకులపై చాహల్​, ధనశ్రీ క్లారిటీ

Last Updated :Jul 16, 2023, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.