ETV Bharat / sports

ICC Test Rankings: దూసుకెళ్లిన బుమ్రా, శార్దూల్

author img

By

Published : Sep 8, 2021, 2:50 PM IST

ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​(ICC Test Rankings)లో టీమ్ఇండియా క్రికెటర్లు శార్దూల్ ఠాకూర్, బుమ్రా దూసుకెళ్లారు. ఓవల్ సెంచరీ హీరో రోహిత్ తన పాయింట్లను మెరుగుపరుచుకున్నాడు.

shardul
శార్దూల్

భారత్​-ఇంగ్లాండ్ (INDvsENG) మధ్య జరుగుతోన్న టెస్టు సిరీస్​లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టీమ్ఇండియా ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్(shardul thakur test career), ఇంగ్లాండ్ బ్యాట్స్​మన్ ఒల్లీ పోప్ ర్యాంకింగ్స్​లో దూసుకెళ్లారు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​(ICC Test Rankings)​లో పోప్​ 49వ స్థానంలో ఉండగా, శార్దూల్ బ్యాట్స్​మెన్ విభాగంలో 59వ ర్యాంక్​, బౌలర్ల విభాగంలో 49వ ర్యాంక్​లో నిలిచాడు. ఓవరాల్​గా టెస్టు ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి.

టీమ్ఇండియా ఇలా!

బ్యాట్స్​మెన్ జాబితాలో టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఐదో స్థానంలోనే కొనసాగుతున్నాడు. కానీ నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో సెంచరీ చేసిన కారణంగా ర్యాంకింగ్ పాయింట్లను మెరుగుపరచుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీకి 30 పాయింట్ల దూరంలో ఉన్నాడు హిట్​మ్యాన్. ఇక బుమ్రా టాప్​-10లోకి చేరాడు. ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతున్నాడు.

టెస్టు బ్యాట్స్​మెన్ జాబితాలో జో రూట్ 903 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్ (908), ఆల్​రౌండర్ల విభాగంలో జాసన్ హౌల్టర్ (434) టాప్ ర్యాంకుల్లో ఉన్నారు.

ఇవీ చూడండి: మైదానంలో రైనాను తిట్టిన ధోనీ.. కారణమేంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.