ETV Bharat / sports

తాగి రచ్చ చేసిన క్రికెటర్లు.. చివరకు..

author img

By

Published : Jan 18, 2022, 2:45 PM IST

AUS vs ENG: యాషెస్​ సిరీస్​లో ఇంగ్లాండ్​పై ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఈ ఆనందంలో కొందరు క్రికెటర్లు శ్రుతిమించి మద్యం సేవించి హోటల్​ గదిలో అల్లరి చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారికి గట్టి వార్నింగ్​ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

aus, eng
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్

AUS vs ENG: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్టులో విజయం సాధించి 4-0 తేడాతో యాషెస్​ సిరీస్​ సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. అయితే.. గెలిచిన ఆనందంలో ఆసీస్ ఆటగాళ్లు, ఓడిన బాధలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు కలిసి పార్టీ చేసుకున్నారు. హోబర్ట్​లోని ఓ హోటల్​లో శ్రుతిమించి తాగి పోలీసులు వార్నింగ్​ ఇచ్చే పరిస్థితి కొని తెచ్చుకున్నారు.

ఇదీ జరిగింది..

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, పేసర్ జేమ్స్​ అండర్సన్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు అలెక్స్ క్యారీ, నాథన్ లయాన్, ట్రావిస్ హెడ్ సహా పలువురు ఆటగాళ్లు హోటల్లో హద్దుమీరి తాగి అల్లరి చేశారు. దీంతో హోటల్​ దగ్గరకు చేరుకున్న పోలీసులు..'అల్లరి మరీ ఎక్కువైంది. మీరు ఇబ్బంది పెడుతున్నారంటూ కంప్లైంట్ వచ్చింది. అందుకే మేం ఇక్కడకు వచ్చాం' అని వార్నింగ్ ఇచ్చారు. 'పడుకునే టైమ్​ అయింది. వెళ్లి నిద్రపోండి' అని ఆటగాళ్లకు చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అయితే.. ఆటగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Ashes 2021: ఉత్కంఠరేపిన నాలుగో టెస్టు.. చివరికి డ్రా

ఆఖరి టెస్టులోనూ ఇంగ్లాండ్ చిత్తు.. 4-0తో 'యాషెస్'​ ఆసీస్​ కైవసం​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.