ETV Bharat / sports

Asia Cup 2023 Schedule : ఆసియా కప్ షెడ్యూల్​ వచ్చేసింది.. పాక్​తో భారత్​ పోరు అప్పుడే..

author img

By

Published : Jul 19, 2023, 7:25 PM IST

Updated : Jul 19, 2023, 10:16 PM IST

Asia Cup 2023 Schedule : ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబరు 2న భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో శ్రీలంకలోని క్యాండీలో తలపడనుంది. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభమవ్వగా.. సెప్టెంబరు 17న ఫైనల్ జరగనుంది.

Asia Cup 2023 Schedule
ఆసియా కప్ షెడ్యూల్​

Asia Cup 2023 Schedule : ఆసియా కప్ 2023 షెడ్యూల్​ను​ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా బుధవారం ప్రకటించారు. ఈ టోర్నీలో సెప్టెంబర్​ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్​కు శ్రీలంక క్యాండీ వేదికకానుంది. ఆగస్టు 30న పాకిస్థాన్ - నేపాల్​ మ్యాచ్​తో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇక టోర్నీలో పాల్గొనే ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. కాగా ఆరు జట్ల మధ్య మొత్తం 13 మ్యాచ్​లు జరగనున్నాయి. సెప్టెంబరు 17వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్​తో టోర్నీకి తెరపడనుంది.

  • Schedule for the Men's ODI Asia Cup 2023 announced. India to take on Pakistan on 2nd September at Kandy in Sri Lanka.

    In the inaugural match on 30th August, Pakistan and Nepal face each other in Multan. pic.twitter.com/9m70fd7Nm6

    — ANI (@ANI) July 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Asia Cup 2023 ind vs pak :అయితే భారత్, పాకిస్థాన్, నేపాల్​ జట్లు గ్రూప్ -ఏ కాగా.. బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్​లు గ్రూప్​ - బీలో ఉన్నాయి. గ్రూప్​ స్టేజ్​లో మొత్తం ఆరు మ్యాచ్​లు జరగనున్నాయి. రెండు గ్రూప్​ల్లో టాప్​ 2 జట్లు.. సూపర్​ 4 మ్యాచ్​లు ఆడతాయి. గ్రూప్‌-ఏలో టాప్​లో ఉన్న జట్టు, గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో సెప్టెంబరు 6న సూపర్‌-4లో తొలి మ్యాచ్‌ ఆడుతుంది. సెప్టెంబరు 15న సూపర్‌-4 చివరి మ్యాచ్‌ జరుగుతుంది. ఇందులో టాప్‌ - 2లో నిలిచిన జట్లు కొలంబొలో జరిగే ఫైనల్​ మ్యాచ్​కు అర్హత సాధిస్తాయి.

Asia Cup 2023 Venue : కాగా ఈ టోర్నమెంట్​కు పాకిస్థాన్ ఆతిథ్యం వహించినప్పటికీ.. టీమ్ఇండియా పాక్ పర్యటనకు వెళ్లేందుకు నిరాకరించింది. అందువల్ల ఈ టోర్నీ.. హైబ్రిడ్‌ మోడల్‌లో జరగనుంది. ఈ విధంగా పాక్​లోని ముల్తాన్‌లో ఒక మ్యాచ్‌.. లాహోర్‌లో మరో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. మిగిలిన తొమ్మిది మ్యాచ్​లు శ్రీలంకలో జరగనున్నాయి. అందులో మూడింటికి క్యాండీ ఆతిథ్యమివ్వగా.. మరో ఆరు మ్యాచ్​లకు కొలంబో వేదిక కానుంది. గతేడాది టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నమెంట్ ఈసారి వన్డే ఫార్మాట్​లో జరగనుంది. అక్టోబరులో జరగబోయే వన్డే ప్రపంచ కప్​ను దృష్టిలో ఉంచుకొని ఈసారి టోర్నమెంట్​ను వన్డే ఫార్మాట్​లో జరపనున్నారు.

Last Updated :Jul 19, 2023, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.