Vishwak sen new movie: యువ కథానాయకుడు విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విలేజ్ బ్యాక్‌డ్రాప్ పెళ్లి నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మార్చి 4న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14371018_viswak-movie.jpg)
లేటు వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరో.. ఆ పెళ్లి అవుతుందా లేదా అనే టెన్షన్ లో పడే పాట్లు.. ఇలా ఫన్నీ ఫన్నీగా సాగుతున్న టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా చేసింది. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించారు.
1945 Movie OTT: రానా '1945' సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 7 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. స్వాతంత్ర్య నేపథ్య కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రెజీనా హీరోయిన్గా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతమందించగా, సత్యశివ దర్శకత్వం వహించారు.
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14371018_1945-movie.jpg)
'బిగ్‌బాస్' ఫేమ్ సొహైల్ హీరోగా నటిస్తున్న సినిమా 'మిస్టర్ ప్రెగ్నెంట్'. ఇందులోని 'హే చెలి' లిరికల్ సాంగ్‌ను హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. ఆది సాయికుమార్ 'తీస్మార్ ఖాన్' చిత్రంలోని 'పాప ఆగవే' లిరికల్ సాంగ్‌ను హీరో వరుణ్‌తేజ్ విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న 'ప్రేమ్‌కుమార్' సినిమాలోని తొలిగీతం 'నీలంబరం'.. శనివారం ఉదయం రిలీజ్ కానుంది. సెన్సార్ పూర్తి చేసుకున్న 'సెహరి' మూవీ.. యూబైఏ సర్టిఫికెట్ అందుకుంది. ఫిబ్రవరి 11న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14371018_prem-kumar-movie.jpg)
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14371018_sehari.jpg)
ఇవీ చదవండి: