ETV Bharat / sitara

'దృశ్యం 2' ట్రైలర్.. పోలీసులకు రాంబాబు చిక్కాడా?

author img

By

Published : Nov 15, 2021, 8:13 PM IST

'దృశ్యం'కు కొనసాగింపుగా వస్తున్న 'దృశ్యం 2'.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రైలర్​ను రిలీజ్ చేశారు.

Drushyam 2 Official Trailer
దృశ్యం 2 ట్రైలర్

వెంకటేశ్ 'దృశ్యం 2' ట్రైలర్​ రిలీజైంది. 'ఇప్పుడు రాంబాబు ఫోకస్‌ మొత్తం సినిమా తీయడం మీద ఉంది. చట్టానికి దొరకనన్న ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. వాడు సినిమా తీసేలోపు.. వాడికి సినిమా చూపిద్దాం' అనే డైలాగ్​ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. నవంబరు 25న అమెజాన్ ప్రైమ్​ ఓటీటీలో నేరుగా విడుదల చేయనున్నారు.

వరుణ్ హత్య కేసులో రాంబాబు కుటుంబం.. పోలీసులకు దొరికిందా?రాంబాబు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నారు అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

ఇందులో వెంకటేశ్​ సరసన మీనా నటించారు. నదియా, నరేశ్, సంపత్​ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మలయాళ ఒరిజినల్​ వెర్షన్​ తెరకెక్కించిన జీతూ జోసెఫ్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.