ETV Bharat / sitara

సుశాంత్​ కేసులో దర్యాప్తు సంస్థల అప్​డేట్స్​ ఇవే..

author img

By

Published : Sep 2, 2020, 7:39 PM IST

సుశాంత్​ కేసు విచారణలో భాగంగా రియా తండ్రి ఇంద్రజిత్​, సుశాంత్​ స్నేహితుడు సిద్ధార్థ్​లను సీబీఐ నేడు విచారించింది. డ్రగ్స్​ కేసులో అద్బుల్​ బాసిత్​ పరిహార్​, జైద్​ విలత్రాలను ఎన్సీబీ అరెస్టు చేశారు. వరుణ్ మాథుర్​ ఈడీ ఎదుట హాజరయ్యారు.

Sushant Singh
సుశాంత్​ సింగ్​

బాలీవుడ్​ హీరో సుశాంత్​ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. సీబీఐ, నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్​సీబీ), ఈడీ వంటి అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థలు ఈ కేసును అనేక కోణాల్లో పరిశీలిస్తున్నాయి. బుధవారం రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్​, సుశాంత్​ స్నేహితుడు సిద్ధార్థ్​ పితానీలను సీబీఐ ప్రశ్నించింది.

ఇద్దరు అరెస్ట్​...

మరోవైపు రియా చక్రవర్తి సహచరుడు శామ్యూల్​ మిరండాతో సంబంధం ఉన్న అబ్దుల్ బాసిత్​ పరిహార్​ అనే వ్యక్తిని నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్సీబీ) అరెస్టు చేసింది. రియా సోదరుడు షోయిక్​ చక్రవర్తి సూచనల మేరకు మిరండా డ్రగ్స్​ సేకరించినట్లు ఎన్సీబీ తెలిపింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయికి చెందిన జైద్​ విలత్రానూ.. ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈడీ ఎదుట సుశాంత్​ స్నేహితుడు...

సుశాంత్​ స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన వరుణ్ మాథుర్​ను బుధవారం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) ప్రశ్నించింది.

పట్నాలో సుశాంత్​ మృతికి సంబంధించి నమోదైన కేసు చట్టబద్ధమైనదని ఆగస్టు 19న సుప్రీం కోర్టు పేర్కొంది. కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే రియా చక్రవర్తి సహా ఆమె కుటుంబ సభ్యులు, తదితరులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది సీబీఐ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.