ETV Bharat / sitara

గాయకుడు ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్​

author img

By

Published : Sep 7, 2020, 4:47 PM IST

Updated : Sep 7, 2020, 5:07 PM IST

balu negitive
balu negitive

16:44 September 07

గాయకుడు ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్​

ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యానికి కరోనా నెగిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన తన ఐపాడ్​లో టెన్నిస్, క్రికెట్ మ్యాచ్​లు చూస్తున్నారని తెలిపారు.

"కొన్ని రోజులుగా నాన్న ఆరోగ్య పరిస్థితిపై అప్​డేట్స్ ఇవ్వనందుకు క్షమాపణలు. నాన్న ఊపిరితిత్తుల సమస్య నుంచి కోలుకుంటున్నారు. అదృష్టం ఏంటంటే ప్రస్తుతం నాన్నకు కరోనా నెగిటివ్​గా నిర్ధరణ అయింది. ఇంతకుముందు కూడా చెప్పా. కరోనా నెగిటివ్​ వచ్చిందా రాలేదా అన్నది సమస్య కాదు. ఆయన ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్ తగ్గాలని అందరం కోరుకుంటున్నాం. అది త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఆయన తన ఐపాడ్​లో టెన్నిస్, క్రికెట్ మ్యాచ్​లు చూస్తున్నారు. ఐపీఎల్ కోసం నాన్న ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫిజియోథెరపీ జరుగుతోంది. నాన్న ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు."

                               -ఎస్పీ చరణ్, బాలు తనయుడు​

కరోనా కారణంగా ప్రస్తుతం బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కోసం అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. సినీ ప్రముఖులూ బాలు త్వరగా అనారోగ్యం నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు. 

Last Updated :Sep 7, 2020, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.