ETV Bharat / sitara

Drugs Case News: ఆర్యన్‌తో ఫోన్​లో మాట్లాడిన షారుక్

author img

By

Published : Oct 4, 2021, 2:44 PM IST

sharukh khan son arrest news
ఆర్యన్ ఖాన్ అరెస్టు

డ్రగ్స్​ కేసులో(Drugs Case News) అరెస్టయిన తన కుమారుడు ఆర్యన్ ఖాన్​తో బాలీవుడ్​ సూపర్ స్టార్ షారుక్ ఖాన్​ మాట్లాడారు. ఆర్యన్ అరెస్టు తర్వాత అతడితో షారుక్​ రెండు నిమిషాలపాటు ఫోన్​లో మాట్లాడారని ఎన్​సీబీ అధికారులు తెలిపారు.

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్ ఖాన్‌ తన కుమారుడితో మాట్లాడారు. ఆర్యన్‌ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు ఆదివారం అరెస్టు(Drugs Case News) చేసిన తర్వాత షారుక్ రెండు నిమిషాలపాటు ఫోన్‌లో మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. చట్టపరమైన ప్రక్రియలో భాగంగా ఆర్యన్‌ తండ్రితో మాట్లాడారని ఎన్‌సీబీ వర్గాలు వెల్లడించాయి. విచారణ సమయంలో ఆర్యన్‌ ఒక దశలో కన్నీటి పర్యంతమైనట్లు ఆ వర్గాలు తెలిపాయి. నేడు ఆర్యన్‌ను మరోసారి కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

శనివారం రాత్రి ముంబయి నుంచి గోవా వెళ్తున్న ఓడలో ఏర్పాటుచేసిన రేవ్‌ పార్టీపై ఎన్​సీబీ అధికారులు జరిపిన దాడిలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ (23) సహా మరో ఏడుగురు అరెస్టయ్యారు. ఈ పార్టీలో కొంతమంది దుస్తుల్లో దాచుకొన్న ఎక్‌స్టసీ, కొకెయిన్‌, మఫెడ్రోన్‌ (ఎండీ), చరస్‌ వంటి మత్తు పదార్థాలను(Drugs Case News) అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు యువతులతోపాటు అదుపులోకి తీసుకున్న బృందంలో మూన్‌మూన్‌ ధామేచ, నుపుర్‌ సారిక, ఇస్మీత్‌ సింగ్‌, మోహక్‌ జస్వాల్‌, విక్రాంత్‌ ఛోకర్‌, గోమిత్‌ చోప్రా, ఆర్యన్‌ఖాన్‌, అర్బాజ్‌ మర్చంట్‌ ఉన్నారు.

ఎవరీ అర్బాజ్‌, మూన్‌మూన్‌..?

ఈ కేసులో ఆర్యన్‌తోపాటు ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధామేచ. మిగిలిన వారికి సంబంధించిన వివరాలు పెద్దగా వెలుగులోకి రాలేదు. మోహక్‌ జస్వాల్‌, నుపుర్‌ సారిక, గోమిత్‌ చోప్రాలు దిల్లీ వాసులు. మోహక్‌, నుపుర్‌ సారిక ఫ్యాషన్‌ డిజైనర్లు కాగా గోమిత్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌.

  • అర్బాజ్‌ మర్చంట్‌: ఇతను ఒక నటుడు. ఆర్యన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. వీరిద్దరు తరచూ పార్టీలు చేసుకున్న ఫొటోలు మీడియాలో వస్తుంటాయి. ఆర్యన్‌ సోదరి సుహానా ఖాన్‌కు కూడా మిత్రుడు.
  • మూన్‌మూన్‌ ధామేచ: ఈమెది మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్తల కుటుంబం. ఫ్యాషన్‌ పరిశ్రమలో మోడల్‌గా పనిచేస్తున్నారు.

ఆర్యన్‌ తరఫున ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌ సతీష్‌..

ఆర్యన్‌ ఖాన్‌ కేసు వాదించే బాధ్యతను క్రిమినల్‌ లాయర్‌ సతీష్‌ మానెషిండేకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. రామ్‌జెఠ్మాలనీ వద్ద ఆయన పనిచేశారు. బాలీవుడ్‌కు సంబంధించిన చాలా హైప్రొఫైల్‌ కేసులను ఆయనే వాదించారు.

  • 1993లో బాంబే బ్లాస్ట్‌ కేసుకు సంబంధించి సంజయ్‌ దత్‌ తరఫున వాదించి బెయిల్‌ ఇప్పించారు. ఆయుధ చట్టం కింద సంజయ్‌పై పెట్టిన కేసుపై కూడా వాదించారు.
  • 2002లో సల్మాన్‌ ఖాన్‌పై నమోదైన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసును కూడా సతీష్ వాదించారు. 1998లో కృష్ణజింకల వేట కేసులో సల్మాన్‌ తరఫున వాదనలు వినిపించారు.
  • సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో కూడా రియా చక్రవర్తి తరఫున సతీష్‌ వాదనలు వినిపించారు.
  • తాజాగా ఆర్యన్‌ ఖాన్‌ కేసును వాదిస్తున్నారు. తన క్లైంట్‌ను నిర్వాహకులే నౌకలోకి ఆహ్వానించారని సతీష్‌ చెబుతున్నారు. ఆర్యన్‌ వద్ద నుంచి ఎటువంటి నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకోలేదని, ఇక వాటిని వాడినట్లు ఎటువంటి ఆధారాలు లేవని సతీష్‌ పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.