ETV Bharat / sitara

మగవాళ్లను ఎందుకు ప్రశ్నించరు?.. సమంత పోస్ట్​ వైరల్

author img

By

Published : Oct 8, 2021, 12:03 PM IST

నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత సోషల్‌ మీడియా అకౌంట్లపై మరింత ఫోకస్‌ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె చేసే పోస్టులపై ఓ కన్నేస్తున్నారు నెటిజన్లు. తాజాగా మరోసారి తన పోస్టుతో నెటిజన్లను గందరగోళంలో పడేశారు సామ్.

Samantha
సమంత

సోషల్‌ మీడియాలో సమంతకున్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఇక నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత(samantha latest news) సోషల్‌ మీడియా అకౌంట్లపై మరింత ఫోకస్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమె షేర్‌ చేసే పోస్టులు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా తన మనసులోని బాధను బయటపెడుతూ ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్‌చేసుకున్నారు సామ్. "ఎప్పుడూ మహిళలనే ప్రశ్నించే ఈ సమాజం మగవాళ్లను మాత్రం ఎప్పుడూ ప్రశ్నించదు..అలాంటప్పుడు మనకు ప్రాథమికంగా నైతికత లేనట్లే" అంటూ ఓ కొటేషన్‌ను ఇన్‌స్టాలో పంచుకున్నారు సమంత.

సమంత, నాగ చైతన్య(samantha chai latest news)జంట విడాకుల అంశం తెలిసినప్పటి నుంచి.. వారు సోషల్​ మీడియాలో ఏవిధమైన పోస్టు పెట్టినప్పటికీ వైరల్​ అవుతూనే ఉన్నాయి. సంబంధంలేని విషయాలను కూడా అభిమానులు వీరి జీవితానికి ఆపాదిస్తున్నారు. ఇటీవలే సమంత ఇన్​స్టాలో చేసిన పోస్ట్​ సోషల్​ మీడియాలో వైరల్ అయింది.​ ఆ పోస్టుపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. తెలుపు రంగు డ్రస్ ధరించి నడుస్తూ ఉన్న ఓ ఫొటోను షేర్ చేశారు.

Samantha
సమంత పోస్ట్

దశబ్దకాలంపాటు ప్రేమ.. నాలుగేళ్ల వైవాహిక బంధాని(samantha chai latest news)కి స్వస్తి చెబుతున్నట్లు అక్టోబర్‌ 2న నాగచైతన్య-సమంత అధికారికంగా ప్రకటించారు. దీంతో, వాళ్ల కుటుంబసభ్యులతోపాటు అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇక, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సామ్‌ 'శాకుంతలం(shakuntalam movie)', 'కాతు వక్కుల రెందు కాదల్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇవీ చూడండి:

'నేనే మారాలి'.. నెట్టింట సమంత ఫిలాసఫి

ఎన్టీఆర్​ షోలో సమంత.. గెలిచిన డబ్బులు ఆ ట్రస్ట్​కు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.