అమితాబ్ బచ్చన్(Amitabh), రజనీకాంత్(Rajinikanth).. దేశం గర్వించదగ్గ నటులు. మరి ఈ ఇద్దరూ కలిసి 'రోబో'(ROBO movie) చిత్రంలో కనిపిస్తే ఎలా ఉండేది? అది కూడా ఒకరు హీరోగా, మరొకరు విలన్‌గా. ఊహించడానికే ఎంతో బాగుంది కదా! అయితే ఈ కాంబినేషన్ సెట్ చేసేందుకు దర్శకుడు శంకర్(Shankar) ప్రయత్నం చేశారు. కానీ, రజనీ మాట వల్ల అది కార్యరూపం దాల్చలేదు.
అసలేం జరిగిందంటే..?
'రోబో' సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించమని అమితాబ్‌ను అడిగారు దర్శకుడు శంకర్. ఇదే విషయమై రజనీకాంత్‌కు అమితాబ్ ఫోన్ చేసి అడగ్గా.. ప్రేక్షకులు మిమ్మల్ని విలన్‌గా అంగీకరించలేరు, ఈ పాత్ర చేయొద్దు అని సూచించారు. అందుకే 'రోబో'లో తను నటించలేదని ఓ సందర్భంలో తెలిపారు అమితాబ్.
ఆ తర్వాత '2.O'(2.O movie) సినిమాలోనూ విలన్‌గా అమితాబ్ నటిస్తున్నారంటూ అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. సదరు వార్తలపైనా స్పందించారాయన. '2.O' కోసం తనని ఎవరూ సంప్రదించలేదన్నారు. అలా 'రోబో' చిత్రంలో డ్యానీ, '2.O'లో అక్షయ్ కుమార్(Akshay Kumar) విలన్‌గా కనిపించి మెప్పించారు.
ఇదీ చూడండి: Raj and Dk: సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి.. స్టార్స్‌గా ఎదిగి