ETV Bharat / sitara

'రాధేశ్యామ్' కొత్త​ ట్రైలర్.. పెళ్లెందుకు కాలేదో చెప్పిన ప్రభాస్​

author img

By

Published : Mar 2, 2022, 3:12 PM IST

Updated : Mar 2, 2022, 7:30 PM IST

Radhe shyam release date: పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్​' చిత్రం నుంచి రెండో ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో పెళ్లి ఎందుకు కాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చారు ప్రభాస్​.

Radhe Shyam trailer
'రాధేశ్యామ్' రెండో ట్రైలర్​

Radhe shyam release date: రెబల్​ స్టార్​ ప్రభాస్, పూజాహెగ్డే నటించిన 'రాధేశ్యామ్' చిత్రంలోని రెండో ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం అబ్బురపరిచే విజువల్స్​తో ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. 'నేను ఎవరి చేతి రాతలైనా ఒక్కసారే చూస్తాను.. రెండోసారి చూడను' అని ప్రభాస్ చెప్పిన డైలాగ్​ అభిమానులను అలరించింది.

Radhe shyam
జాతకం చెప్పించుకుంటున్న ప్రభాస్​

1970ల కాలం నాటి ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజాహెగ్డే కనిపించనుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మార్చి 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

Radhe shyam
హస్తసాముద్రికా నిపుణుడితో మాట్లాడుతున్న ప్రభాస్
Radhe shyam
జాతకం చెప్పించుకుంటున్న పూజాహెగ్డే

రొమాంటిక్ లవ్​స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్​ ఓవర్​​ ఇచ్చారు. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు.

Radhe shyam
రాధేశ్యామ్ ట్రైలర్​ రిలీజ్​ ఈవెంట్​లో ప్రభాస్​

ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్-కే చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది.

పెళ్లిపై రిప్లై ఇచ్చిన ప్రభాస్..

Prabhas Radhe Shyam Trailer: రాధేశ్యామ్ రిలీజ్ ట్రైలర్ వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్, పూజాహెగ్డే పాల్గొని సందడి చేశారు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి? అని విలేకరులు అడగ్గా తనదైన శైలిలో సరదాగా సమాధానం చెప్పారు ప్రభాస్​. ప్రేమపై తన అంచానాలు ప్రతిసారి తప్పాయని, అందుకే తనకు ఇంకా పెళ్లి కాలేదని బదులిచ్చారు.

Radhe shyam
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్​లో రాధేశ్యామ్ చిత్ర బృందం

జాతకం చెప్పించుకున్న ప్రభాస్​..

ట్రైలర్ రిలీజ్​ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన ఆస్ట్రాలజీ కార్నర్‌లో ప్రభాస్‌, పూజాహెగ్డే హస్తసాముద్రికా నిపుణుడితో జాతకం చెప్పించుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'పొన్నియన్​ సెల్వన్'లో యుద్ధ వీరుడిలా విక్రమ్​.. మెరిసిన ఐశ్వర్య, త్రిష​

Last Updated :Mar 2, 2022, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.