ETV Bharat / sitara

Priyamani: ప్రియమణికి బంపర్​ ఆఫర్.. పవన్​ సినిమాలో ఛాన్స్!

author img

By

Published : Sep 4, 2021, 5:30 AM IST

Updated : Sep 4, 2021, 6:53 AM IST

పవన్-హరీశ్​ శంకర్​ కాంబోలో తెరకెక్కే కొత్త సినిమా కోసం నటి ప్రియమణిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే ఆమె పాత్ర ఏంటి? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Priyamani Pawan Kalyan movie
ప్రియమణి

'నారప్ప' సినిమాలో డీ గ్లామరైజ్​గా కనిపించిన మెప్పించిన నటి ప్రియమణి.. ప్రస్తుతం విభిన్న పాత్రలు చేస్తూ అలరిస్తోంది. ఓ వైపు వెబ్​ సిరీస్​, మరోవైపు పలు భాషల్లోని చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఇప్పుడు ఆమెకు అద్భుతమైన అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ సినిమాలోని కీలకపాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

pawan harish shankar movie
పవన్-హరీశ్​ శంకర్ మూవీ

పవన్​, డైరెక్టర్​ హరీశ్​ శంకర్​తో సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రకటన వచ్చినప్పటికీ.. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల తర్వాత అందులో పవర్​స్టార్ నటిస్తారు. అయితే 'నారప్ప'లో ప్రియమణి నటన చూసి ఫిదా అయితే ఈ చిత్రబృందం.. తమ సినిమా కోసం ఎంపిక చేసుకుందట.

priyamani virataparvam
విరాటపర్వంలో ప్రియమణి

ఇవీ చదవండి:

Last Updated : Sep 4, 2021, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.