ETV Bharat / sitara

Prabhas: ప్రభాస్ 25వ సినిమా.. టైటిల్​ అదిరిపోయింది!

author img

By

Published : Sep 4, 2021, 5:10 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ మరోసారి పీరియాడికల్ కథతో నటించేందుకు సిద్ధమవుతున్నారట. దిల్​రాజు నిర్మించే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఇంకా ఖరారు కానప్పటికీ, టైటిల్​ మాత్రం రిజిస్టర్ చేయించేశారట.

Prabhas 25 movie
ప్రభాస్

పాన్ ఇండియా రేంజ్​లో ప్రస్తుతం డార్లింగ్ స్టార్ ప్రభాస్(prabhas age) కంటే ఎవరూ బిజీగా లేరు. ఎందుకంటే ఒకేసారి నాలుగు ప్రాజెక్టులు చేస్తున్న ఆయన.. ఆ తర్వాత చిత్రాలను లైనప్​లో పెట్టేస్తున్నారు. వాటి గురించిన ఆసక్తికర విషయాలు అభిమానులను అలరిస్తున్నాయి.

ప్రభాస్-పూజా హెగ్డే నటించిన వింటేజ్​ లవ్​స్టోరీ 'రాధేశ్యామ్'(prabhas radhe shyam). ఇప్పటికే షూటింగ్​ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

.
.

మరోవైపు యాక్షన్ ఎంటర్​టైనర్​ 'సలార్'(prabhas salaar), రామాయణం ఆధారంగా తెరెకక్కుతున్న 'ఆదిపురుష్'(prabhas adipurush) సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు నాగ్ అశ్విన్ తీస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రంలోనూ(#Prabhas24) కథానాయకుడిగా చేస్తున్నారు.

..
.

వీటన్నింటి తర్వాత తన కెరీర్​లోనే ప్రతిష్ఠాత్మకమైన 25వ సినిమాను ప్రభాస్, దిల్​రాజు నిర్మాణంలో చేయనున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కే ఈ ప్రాజెక్టుకు 'వృందావన' టైటిల్​ రిజిస్టర్​ చేయించారట. ఈ చిత్ర షూటింగ్ 2024లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

.
.

ఇవీ చదవండి:

Conclusion:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.