ETV Bharat / sitara

పోలీస్ గెటప్​లో పవన్ న్యూలుక్​​​​.. ఫ్యాన్స్​లో జోష్​

author img

By

Published : Jul 26, 2021, 1:42 PM IST

'అయ్యప్పనుమ్​ కోషియుమ్​'(Ayyappanum Koshiyum Remake) తెలుగు రీమేక్​ షూటింగ్​ తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పవన్​ పోలీస్​​​ లుక్​ను విడుదల చేశారు. ​దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

pawan
పవన్​

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో రానున్న సినిమా 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్' రీమేక్​.(Ayyappan Koshyum Remake). కరోనా కారణంగా తాత్కాలికంగా ఆగిపోయిన షూటింగ్​ తిరిగి సోమవారం ప్రారంభమైంది. పవన సెట్​లో ​ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పవన్​ లుక్​ను విడుదల చేశారు. ఇందులో పోలీస్​ ఇన్​స్పెక్టర్​ భీమ్లానాయక్​గా ఆయన కనిపించనున్నారు.

ఇందులో పవన్​కల్యాణ్, రానా దగ్గుబాటితో పాటు ఐశ్వర్యారాజేశ్​, నిత్యామేనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌(Trivikram Srinivas) మాటలు అందిస్తున్నారు. తమన్​ సంగీత దర్శకుడు. సితార ఎంటర్​టైన్​మెంట్స్​ నిర్మిస్తోంది.

ఇదీ చూడండి: Pawan kalyan: పవన్​ సినిమాలో 'ఫ్యామిలీ మ్యాన్' యాక్టర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.