సైనాపై హీరో సిద్ధార్థ్ అసభ్యకర ట్వీట్.. జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం
Updated on: Jan 10, 2022, 6:02 PM IST

సైనాపై హీరో సిద్ధార్థ్ అసభ్యకర ట్వీట్.. జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం
Updated on: Jan 10, 2022, 6:02 PM IST
Siddharth saina nehwal: షట్లర్ సైనాపై అసభ్యకర రీతిలో సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ఈ విషయమై జాతీయ మహిళా కమిషన్ ఫుల్ సీరియస్‌గా ఉంది. అతడి ఖాతాను వెంటనే డిలీట్ చేయాలని ట్విట్టర్ ఇండియాకు లేఖ రాసింది.
Siddharth tweet: హీరో సిద్ధార్థ్ వ్యవహార శైలిపై జాతీయ మహిళ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌పై అతడు అభ్యంతర కామెంట్స్ చేశాడని, ఈ కేసులో మహారాష్ట్ర డీజీపీ విచారణ చేపట్టాలని మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు.
ఇంతకీ ఏం జరిగింది?
ఇటీవల పంజాబ్ టూర్లో ప్రధాని భద్రతా వైఫల్యం బయటపడింది. ఈ విషయమై సైనా నెహ్వాల్.. ప్రధాని భద్రతకే ముప్పు వాటిల్లితే అప్పుడు ఏ దేశం కూడా క్షేమంగా ఉండదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ జనవరి 5న ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన సిద్ధార్థ్.. సైనాపై అభ్యంతకర కామెంట్ చేశాడు.
తన ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిద్ధార్థ్, సోమవారం మరో ట్వీట్ చేశాడు. తను ఎలాంటి దురుద్దేశంతో కామెంట్ చేయాలేదని అన్నాడు. అయితే సిద్ధార్థ్ ట్విట్టర్ ఖాతాను తక్షణమే బ్లాక్ చేయాలని మహిళా కమిషన్ ఛైర్మన్.. ట్విట్టర్ ఇండియా రెసిడెంట్ గ్రీవెన్స్‌కు లేఖ రాశారు.
అలానే సిద్ధార్థ్ వ్యాఖ్యలపై షట్లర్ సైనా నెహ్వాల్ కూడా స్పందించారు. ఈటీవీ భారత్‌తో ఫోన్లో దాని గురించి మాట్లాడారు. సిద్ధార్థ్‌ను నటుడిగా ఇష్టపడతానని, కానీ అతడి వ్యాఖ్యలు సరైన రీతిలో లేవని అన్నారు. సరైన పదాలు ఉపయోగించి మాట్లాడాల్సిందని చెప్పారు.
