ETV Bharat / sitara

వారి కోసం మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి విరాళం

author img

By

Published : Mar 26, 2020, 4:21 PM IST

కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్​లోని వేతన కార్మికుల కోసం రూ.కోటి విరాళమిచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు.

megastar chiranjeevi tweet
మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు చాటుకున్నాడు. కరోనా మహమ్మారి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఉపాధి కోల్పోయిన టాలీవుడ్​ సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం రూ.కోటి విరాళాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు.

megastar chiranjeevi tweet
మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

అంతకు ముందు ఈయన తమ్ముడు పవర్​స్టార్ పవన్​కల్యాణ్.. కేంద్ర ప్రభుత్వ సహాయనిధికి రూ.కోటి, తెలుగు రాష్ట్రాల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు విరాళమిచ్చాడు. చిరు కుమారుడు హీరో రామ్​చరణ్.. కరోనా అరికట్టడంలో భాగంగా రూ.70 లక్షలు(కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి) ఇచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.